Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో అటు ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఏం చేసినా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకునే మహేష్ బాబుకు ఇలా ఈడీ నుండీ నోటీసులు రావడం ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు యాడ్ ప్రమోషన్ కోసం సాయి సూర్య డెవలపర్స్ నుంచి రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కంపెనీలలో ఈడీ సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ డబ్బులను మహేష్ బాబు ప్రమోషన్ కింద తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు నోటీసులు జారీ చేస్తూ.. ఆ నోటీసులలో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ దాడులు..
మనీలాండరింగ్ కేసులో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయంలో గత వారం (బుధవారం) ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ చీటింగ్ కేసులో చిక్కుకున్న సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే హైదరాబాదులోని వెంగల్ రావు నగర్ లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా పై మోసపోయిన బాధితులు చీటింగ్ కేస్ పెట్టారు.
నక్కా విష్ణువర్ధన్, మరికొంతమందితో కలిసి 2021 ఏప్రిల్ లో సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మేడోస్ వెంచర్లో శాంతినగర్ లోని 14 ఎకరాల భూమిలో రూ.3 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఈ వెంచర్ లో పెట్టుబడి పెట్టిన ఇతరులు డాక్టర్ సుధాకర్ రావు, కోట్ల శశాంక్, శ్రీనాథ్, హరీష్ , ప్రభావతి , వెంకట్రావు, కృష్ణమోహన్ తో పాటూ మరి కొంతమంది.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుండి అవసరమైన అనుమతులు పొందిన నెలలోపే ఫ్లాట్ రిజిస్టర్ చేయబడతాయని హామీ ఇవ్వడంతో, వ్యవసాయతర భూమితో పాటు.. తనఖా ఫ్లాట్ ల కోసం ఒక ఒప్పందం ద్వారా పెట్టుబడి పెట్టారు. సమయం గడిచే కొద్ది కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పెట్టుబడిదారులలో అనుమానం మరింత పెరిగింది.
Also Read:Vidhyabalan: నిర్మాత అవమానంతో 6 నెలలు నరకం అనుభవించా – విద్యాబాలన్
చీటింగ్ చేస్తూ అక్రమ సంపాదన..
దీంతో రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖతో విచారణ జరిపిన తర్వాత నక్క విష్ణువర్ధన్, అతని సహచరులు మోసపోయామని తెలుసుకున్నారు. వారు పెట్టుబడికి సంబంధించిన అన్ని తనఖా ఫ్లాట్లో థర్డ్ పార్టీపై నాన్షర్లు అంటే ఎస్ ఆర్ వి, టి ఎన్ ఆర్, ఇన్ఫ్రా రాజారావు, వాస్గీ వెంకటేష్ లకు వారి సమ్మతి లేకుండా రిజిస్టర్ చేశారని తెలియడంతో బాధితులు సాయి సూర్య డెవలపర్స్ యాజమాన్యాన్ని ప్రశ్నించినా వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో విష్ణువర్ధన్ తో పాటు మరో 30 మంది న్యాయం కోరుతూ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక మధురానగర్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేసినా.. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో చివరికి సీసీఎస్ కి కేసుని బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..
సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలన్న ఈడీ
ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని మహేష్ కు నోటీసులు పంపిన ఈడీ
సాయి సూర్య డెవలపర్స్ కు ప్రమోషన్స్ చేసినందుకు మహేష్ రూ.3.5 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు
మనీ… pic.twitter.com/4UexBYLigI
— BIG TV Breaking News (@bigtvtelugu) April 22, 2025