Jr.NTR: ఈరోజు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై జరిగిన దాడిపై సోషల్ మీడియా వేదికగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR ) స్పందించారు. దాడి గురించి తెలిసి షాక్ అయ్యానని తెలిపిన ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో.. “సైఫ్ పై జరిగిన దాడి గురించి విని ఆశ్చర్యానికి గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
వీరిద్దరి కాంబోలో దేవర..
ఇకపోతే ఇటీవల వీరిద్దరి కాంబినేషన్లో ‘దేవర’ సినిమా వచ్చింది. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR ) దాదాపు ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. ఇందులో ఎన్టీఆర్ హీరోగా , సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అంతేకాదు ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమా కారణంగానే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని సమాచారం.
సైఫ్ అలీఖాన్ పై దాడి..
అసలు విషయంలోకి వెళితే.. ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ నివాసంలోనే ఆయనపై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తూ ఉండగా.. ఒక ఆగంతకుడు వారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో ఆ ఇంటి పనిమనిషితో వాగ్వాదానికి దిగిన సైఫ్ అలీ ఖాన్, అతడిని శాంతింప చేయాలని ప్రయత్నించగా.. ఆ దుండగుడు కత్తితో దాడి చేసి, అక్కడి నుంచి పరార్ అయ్యారు.వెంటనే కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి హాస్పిటల్ కి తరలించగా.. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సైఫ్ అలీఖాన్ కు మొత్తం ఆరు పోట్లు పడ్డాయని, అందులో రెండు కత్తిపోట్లు మరింత లోతుగా దిగాయి అని వైద్యులు తెలిపారు.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా తర్వాత దేవర సీక్వెల్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో దాదాపు నాలుగు చిత్రాలు చేసిన ఈయన..ఈ చిత్రాలతో కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా తన స్నేహితుడు రామ్ చరణ్(Ram Charan)తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్.ఇందులో కొమరం భీం పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా లభించింది.ఇక ఆస్కార్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.
— Jr NTR (@tarak9999) January 16, 2025