OTT Movie : హారర్ సినిమాలంటేనే ఆమడ దూరం ఉంటారు కొంత మంది. అందులోనూ ఇండొనేషియన్ హారర్ సినిమాలంటే ప్యాంట్ తడిపేసుకుంటారు చాలామంది. ఈ సినిమాలు ఎక్కువగా భయపెడుతుంటాయి. చేతబడి, దెయ్యాలు, ఆత్మల సినిమాలను తీయాడంలో వీళ్ళు బాగా స్పెషలిస్ట్ లు అయిపోయారు. వీటిని ఒంటరిగా చూసారంటే, పై ప్రాణాలు పైకి పోవడం ఖాయం. ఇప్పుడు మనం కొన్ని భయంకరమైన ఇండొనేషియన్ హారర్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం . ఈ హారర్ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఈ వీకెండ్ రాత్రిపూట వీటిని ఒంటరిగా చూడటానికి ప్రయత్నించండి.
‘ది థర్డ్ ఐ’ (The 3rd eye)
2017 లో విడుదలైన ఈ ఇండోనేషియన్ మూవీకి రాకీ సొరయా దర్శకత్వం వహించారు. రిహెమ్ జునియాంటి, రాకీ సొరయా దీనిని రచించారు. ఈ స్టోరీ ఒక అబెల్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె కుటుంబంలో దాగిఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరి వరకూ ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తూనే ఉంటుంది.
ఇండిగో (Indigo)
ఈ ఇండోనేషియన్ హారర్ మిస్టరీ సినిమా 2023లో విడుదలైంది. దీనికి రాకీ సొరాయ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ జోరా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె చిన్నతనం నుండి ‘ఇండిగో’ అనే పేరుతో పిలువబడుతుంది. ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అందరూ అనుకుంటుంటారు. జోరా కి ఒక చెల్లెలు ఉంటుంది. ఆమెను ఒక దెయ్యం వేధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జోరా తన శక్తులను ఉపయోగించి, తన చెల్లెల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ లు ఎదురౌతాయి.
‘కుయాంగ్’ (Kuyang)
2024 లో విడుదలైన ఇండోనీషియన్ హారర్ సినిమాకు యొంగి ఎంగేస్తూ దర్శకత్వం వహించారు. ఇది ఒక నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా స్టోరీ బోర్నియో దీవిలోని జరుగుతుంది. ఆ దీవిలో ఉన్న ఒక గ్రామానికి భార్య భర్తలు కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి వస్తారు. భార్య ప్రెగ్నెంట్ గా ఉండటంతో, ఒక దెయ్యం వీళ్ళ వెంటపడుతుంది. చాలా రోజుల నుంచి ఆ దెయ్యం గర్భిణీలను వెంటాడుతూ ఉంటుంది.
‘బాయి అజాయిబ్’ (Bayi Ajaib)