Arjun S/o Vyjayanthi Movie Pre release event : నటి విజయశాంతి (Vijaya Santhi) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ విజయశాంతి. చాలామంది లేడీ సూపర్ స్టార్ గా ఆమెను పిలుచుకునేవారు. కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆమె కెరీర్ లో ఉన్నాయి. సినిమాలు చేస్తూ కొంతకాలం గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో కూడా యాక్టివ్గా పాల్గొన్నారు విజయశాంతి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి రియంట్రీ ఇచ్చారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా మహేష్ బాబు(Mahesh Babu) కెరియర్ లో కూడా మంచి ప్లస్ అయింది. దర్శకుడుగా అనిల్ రావిపూడి ని కొన్ని మెట్లు ఎక్కించింది.
మళ్లీ పోలీస్ పాత్రలో
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ ఈవెంట్ను నేడు నిర్వహించారు. ఈ ఈవెంట్లో విజయశాంతి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నేను సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాను. కానీ నా అభిమానులు ఎవరు అది సరిపోలేదు అన్నారు. అయితే మళ్లీ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఎలా చేయాలి అని ఆలోచనలో ఉండే దానిని, మంచి పవర్ఫుల్ కథ దొరకాలి మంచి పాత్ర దొరకాలి, అది దొరకడం అంత ఈజీ కాదు కదా అనుకునే తరుణంలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి నా దగ్గరికి వచ్చి ఈ కథను చెప్పారు. అయితే ఈ కథను విన్న వెంటనే నేను చేయకూడదు అనుకున్నాను. కానీ ప్రదీప్ గారికి కొన్ని మార్పులు చెప్పడంతో ఆయన కొన్ని మార్పులు చేసిన తరువాత ఈ కథను చేశాను అంటూ విజయశాంతి తెలిపారు.
ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది
ప్రదీప్ చిలుకూరి కొన్ని మార్పులు చేసిన తర్వాత నేను ఈ కథను చేస్తాను అని ఒప్పుకున్నాను. ఈ విషయాన్ని విజయశాంతి గారు మన సినిమా చేస్తున్నారు అని కళ్యాణ్ రామ్ కు ప్రదీప్ చిలుకూరి చెప్పారు. ఈ సినిమా చేస్తున్న ప్రతిరోజు మాలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని మాకు అర్థమైంది. ఈ సినిమా చేసిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ నుంచి తమ్మి రాజు గారు ఫోన్ చేసి చెప్పారు. అమ్మ నిజంగా అద్భుతంగా చేశారు అంటూ మాట్లాడారు. మీరు కళ్యాణ్ రామ్ చేసిన కొన్ని సీన్స్ కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవుతుంది అని చెబుతున్నాను మీరు ధైర్యంగా ఉండండి అంటూ నందమూరి అభిమానులకు భరోసా ఇచ్చారు.
Also Read : Arjun S/o Vyjayanthi Trailer : అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ ఎలా ఉందంటే.?