BigTV English

War 2 : వద్దు బాబోయ్ వార్ 2 ఆఫర్, బాలీవుడ్ మన కంటే దారుణంగా ఉంది

War 2 : వద్దు బాబోయ్ వార్ 2 ఆఫర్, బాలీవుడ్ మన కంటే దారుణంగా ఉంది

War 2 : ప్రతి సినిమాలో కొంతమంది స్టార్ హీరోలకు బాడీ డబుల్ ఉండడం సహజమే. హీరోలతో కొన్ని షాట్స్ తీసిన తర్వాత అదే స్ట్రక్చర్ ఉన్న కొంతమంది బాడీ డబుల్స్ ను దర్శకులు సినిమాల కోసం వాడుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోవడం వలన చాలామందికి టెక్నికల్ గా కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. చాలామంది సినీ విశ్లేషకులు ఒక సీన్ చూపించి మరి ఆ సీన్ ని ఎలా తీసి ఉంటారు అని ఇంస్టాగ్రామ్ వేదికగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. అలానే కొంతమంది సినిమాని స్లో మోషన్ లో పెట్టి దాంట్లో తప్పుల్ని చూపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు డైలాగ్స్ లో ఉన్న బూతులు కూడా వెలికితీస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాయి. అలానే చాలామంది టెక్నీషియన్స్ ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బాడీ డబుల్స్ ను కూడా ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు.


ఎన్టీఆర్ బాడీ డబుల్

జూనియర్ ఎన్టీఆర్ కు కూడా బాడీ డబుల్ ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ బాడీ డబుల్ గా నటించింది ఈశ్వర్ హరీష్. ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో రామ్ చరణ్ తో ఈశ్వర్ కి ఒక ఫైట్ ఉందట, అయితే ఆ ఫైట్ ఎడిటింగ్ లో పోయింది. కానీ నేను సినిమాలో అక్కడక్కడ కనిపిస్తాను అని చెబుతూ వచ్చాడు. అయితే అక్కడ వినయ్ అనే ఒక వ్యక్తి తనను చూసి రాజమౌళి టీం నీ కోసం నెల రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు నువ్వు రావాలి అని చెప్పినప్పుడు. ఈశ్వర హరీష్ త్రిబుల్ ఆర్ షూటింగ్ కి వెళ్లాడు. అయితే దాదాపు నాలుగు రోజులు పాటు ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడట. కొమరం భీముడు పాటలు కనిపించే హాండ్స్ కూడా తనవే అని చెబుతూ వచ్చాడు.


వార్ 2 ఆఫర్ రిజెక్ట్

ఇకపోతే ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ వార్ 2 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కూడా ఈశ్వర్ హరీష్ ను సంప్రదించింది చిత్ర యూనిట్. అయితే రెమ్యూనరేషన్ కుదరకపోవడం వలన వెళ్లలేదు అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కి రమ్మని చెప్పారట. అయితే వాళ్లు చెప్పిన రెమ్యూనరేషన్ ఫ్లైట్ ఖర్చులకి కూడా సరిపోవు అని తేల్చి చెప్పేసాడు. బాలీవుడ్ పెద్దపెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తారు గాని రెమ్యూనరేషన్ మంచిగా ఇవ్వరు వాళ్లతో పోలిస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Sandeep Reddy Vanga Spirit: ప్రభాస్ తో పాటు మరో మలయాళం హీరో

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×