BigTV English

Saif Ali Khan : పెళ్ళాం పిల్లలతో విదేశాలకు చెక్కేస్తున్న సైఫ్… ఇండియాకు గుడ్ బై చెప్పడానికి కారణం ఇదేనా?

Saif Ali Khan : పెళ్ళాం పిల్లలతో విదేశాలకు చెక్కేస్తున్న సైఫ్… ఇండియాకు గుడ్ బై చెప్పడానికి కారణం ఇదేనా?

Saif Ali Khan : బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ త్వరలోనే ఇండియా వదిలి వెళ్ళబోతున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దానికి కారణం తాజాగా ఆయన విదేశాల్లో ఓ లగ్జరీ ఇంటిని కొనడం. సాధారణంగానే సెలబ్రిటీలు విదేశాలలో కూడా ఆస్తులు కొంటూ ఉంటారు. అయినంత మాత్రాన ఇండియాను వదిలి వెళ్ళిపోతారని కాదు. కానీ సైఫ్ విషయంలో మాత్రం ఈ ప్రచారం జోరుగా నడుస్తోంది. మరి దీనికి కారణం ఏంటంటే…


ఇండియాకు గుడ్ బై చెప్పబోతున్న సైఫ్? 

సైఫ్ అలీ ఖాన్ ఇండియాను విడిచి వెల్లపోవాలని ఆలోచిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి. ఇటీవల సైఫ్ ఖతార్‌లోని దోహాలోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో ఒక కొత్త ఇంటిని కొన్నాడు. తరువాత ఓ ప్రెస్ మీట్ లో ఇండియాకు దగ్గరగా, సురక్షితంగా, ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండే రెండవ ఇంటిని తను కోరుకుంటున్నట్టు వెల్లడించారు.


ఈ విషయం గురించి సైఫ్ మాట్లాడుతూ “నా రెండవ ఇల్లు ఇండియా కు పెద్దగా దూరంగా లేదు. సులభంగా అక్కడికి చేరుకోవచ్చు. మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ సురక్షితంగా ఉంటుంది. ద్వీపమే అయినప్పటికీ విలాసవంతంగా, అందంగా నివసించడానికి అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఇల్లును కొనుక్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడికి వెళ్ళినప్పుడు కలిగే ఫీలింగ్, అభిప్రాయాలు, ఫుడ్, లైఫ్ స్టైల్ వంటి అంశాలు నా ఈ నిర్ణయానికి దారితీసాయి” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ ఇల్లు కొనడం కంటే ముందే సైఫ్ అక్కడ కొంతకాలం నివసించాడు. తనకు బాగా నచ్చడంతో వెంటనే కొనేశాడు. ఇక తన భార్య కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), కొడుకులు తైమూర్, జహంగీర్ లను ఆ కొత్త ప్రదేశానికి తీసుకెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నానని సైఫ్ వెల్లడించారు. ఆయనకు ఇప్పటికే పటౌడి ప్యాలెస్, బాంద్రా అపార్ట్మెంట్ వంటి లగ్జరీ ఇండ్లు, లండన్ తో పాటు విదేశాల్లో మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నప్పటికీ, ఖతార్ లోని ఈ భవనం ప్రశాంతత, ప్రైవేట్ వైబ్ కారణంగా ప్రత్యేకంగా అనిపిస్తుందని ఆయన వెల్లడించారు. దీంతో సైఫ్ తన ఫ్యామిలీతో కలిసి ఇండియా వదిలి వెళ్లిపోవాలని భావిస్తున్నారని, ఖతార్ లోనే సెటిల్ కావాలని ఆలోస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Read Also : మారుతి వెనకాల సందీప్ – నాగ్ అశ్విన్ కుట్ర… సోషల్ మీడియాలో వైరల్

ఇదే కారణమా ?

ఇక బాలీవుడ్లో మంచి స్టార్ట్ డం ఉన్న హీరోలలో సైఫ్ కూడా ఒకరు. ‘దిల్ చాహతా హై’ నుంచి ‘దేవర’ (Devara)లోని విలన్ రోల్ వరకు అన్ని రకాల విభిన్నమైన పాత్రలు పోషించి ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు. రాజకుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రిలోకి అడుగు పెట్టిన సైఫ్ విలాసంతమైన జీవితం గడుపుతుంటాడు. అయితే ఏడాది జనవరిలో సైఫ్ ఇంట్లోకి చొరబడి, దోపిడీ చేసే ప్రయత్నంలో ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సైఫ్ ఫ్యామిలీని భద్రత గురించి ఆందోళన చెందేలా చేసింది. అదే ఇప్పుడు ఇండియాను వదిలి వెళ్లిపోవడానికి కారణమైందని అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×