NTR Death Anniversary: దివంగత నేత సినీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి. ఆయన వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్గా నిర్వహిస్తారని సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకెళ్ళి నివాళులర్పిస్తారు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్దకెళ్లి తాతకు నివాళులర్పించారు.. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.. ప్రతీ సంవత్సరం ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయంలో జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తమ తాతగారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈసారి కూడా అలాగే వచ్చి.. తన భక్తిని చాటుకున్నారు.. కొద్ది నిమిషాల క్రితం మనవళ్లు ఇద్దరు వచ్చి తాత గారిని గుర్తు చేసుకొని పుష్ప గుచ్చాన్ని పెట్టి నివాళులు అర్పించారు. అన్నా దమ్ములను చూడటానికి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు..
నేడు నందమూరి తారకారామారవు వర్ధంతి సందర్భంగా సినీ రాజకీయ అభిమానులు ఆయన ఘాట్ని సందర్శించి నివాళులర్పిస్తుంటారు. సీనియర్ ఎన్టీఆర్ సినీ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు.. జనవరి 18, 2025న ఎన్టీఆర్ జీవితం, కృషిని స్మరించుకునేందుకు నందమూరి కుటుంబం, నారా కుటుంబం, సినీ రంగం, రాజకీయ ప్రియులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీ శ్రద్ధాంజలి ఘటిస్తారు.
నందమూరి ఫ్యామిలీ మాత్రమే కాదు అటు నారా వారి ఫ్యామిలీ కూడా ఎన్టీఆర్ ఘాటు వద్దకు వచ్చి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకోనున్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడి, ఆయన సేవలను గుర్తు చేసుకోనున్నారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, పలు పార్టీల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. నేటి వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారని సమాచారం. కొన్ని సినిమాల ప్రదర్శనలను కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు..
ఎన్టీఆర్ సినీ ప్రస్థానం..
సినీ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మర్చిపోలేనిది.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. ఆయన నటనతో తెలుగు నాట అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా ఆయనంటే అభిమానం మాత్రం తగ్గలేదు. ఇక ప్రజలకు సేవ చెయ్యాలని సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ప్రజల మనసులో అమితమైన అభిమానాన్ని పొందాడు. ఆయన చేసిన కృషిని ఎవరూ మరవలేరు. ఈ క్రమంలో 29వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ జీవితాన్ని, ఆయన ఆశయాలను, నందమూరి కుటుంబం, సినీ ప్రియులు, ప్రజలు మరోసారి గుర్తు చేసుకొనున్నారు..