Hari Hara Veeramallu: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదట రిలీజ్ అవుతున్న సినిమా ఇది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లు తర్వాత చేస్తున్న స్ట్రైట్ ఫిలిమ్ ఇది. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ కూడా రీమేక్. ఇక హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు స్ట్రైట్ ఫిలిమ్స్ గా రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన అంచనాలు పెరిగాయి. అలానే ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ కూడా మరింత క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ సినిమాకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకుడిగా కూడా చాలా సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలేవి పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కిరణ్ అబ్బవరం హీరోగా రూల్స్ రంజన్ అనే సినిమా కూడా చేశారు. ఆ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా మీద మాత్రం మంచి నమ్మకం చాలా మందికి ఉంది. అలానే సాయి మాధవ్ బుర్ర కూడా ఈ సినిమా కథ గురించి ఒకప్పుడు భారీ ఎలివేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో క్రిష్ జాగర్లమూడి తో పాటు తాను కూడా బయటకు వచ్చేసాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఈ సినిమాలో నుండి ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ కూడా అయింది. ఆ పాట కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది
అసలు సినిమా ఇప్పుడు వస్తుందా.?
వాస్తవానికి ఎప్పుడో సంక్రాంతి కానుక విడుదల కావలసిన ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. ముఖ్యంగా అప్పుడు ఇప్పుడు అని రోజుకో డేట్ చెప్తూ ఏకంగా 11 సార్లు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఓపిక నశించిపోతుంది. కొంతమంది అభిమానులకు ఓపిక నశించి పోతే మరి కొంతమంది మాత్రం ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతోమందికి వడ్డీలు కట్టాల్సి ఉంటుంది సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. సరైన బ్రేక్ ఈవెన్ రాకపోతే ఈ సినిమా భారీ నష్టాలను కలుగజేసే అవకాశం ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు నుంచో అవుతూనే వస్తుంది. అయితే దీనితో కంపేర్ చేసి ఈ సినిమాను ఇప్పుడు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. హరిహర వీరమల్లు సినిమా వచ్చేలోపు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి.
Also Read: Shivalenka KrishnaPrasad : నేను సీనియర్ ప్రొడ్యూసర్ అయినా కూడా ఇప్పుడు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను