BigTV English

Odela 2: మహాకుంభమేళాలో తమన్నా మూవీ టీజర్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన మిల్కీ బ్యూటీ

Odela 2: మహాకుంభమేళాలో తమన్నా మూవీ టీజర్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన మిల్కీ బ్యూటీ

Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య బాలీవుడ్ లో తప్ప అస్సలు తెలుగులో కనిపించడమే మానేసింది. ఏ ముహూర్తాన విజయ్ వర్మతో ప్రేమలో పడిందో కానీ.. బాలీవుడ్ కే అంకితమయ్యింది. అడపాదడపా ఐటెంసాంగ్స్ అయినా తెలుగులో చేస్తూ కనిపించేది. ఇప్పుడు అవే ఐటెంసాంగ్స్ హిందీలో చేస్తూ బిజీగా మారింది. ఇక తెలుగులో తమ్ము బేబీ చాలా గ్యాప్ తరువాత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఓదెల 2. దర్శకుడు సంపత్ నంది కరోనా టైంలో కొత్తగా ఆలోచించి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓదెల రైల్వేస్టేషన్ పేరుతో ఓ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశాడు. హెబ్బా పటేల్ హీరోయిన్ గా  నటించిన ఈ సినిమా.. మంచి విజయాన్ని అందుకుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.


ఇక ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్ గా  సంపత్ నంది ఓదెల 2 ను ప్రకటించాడు. ఈసారి థియేటర్ లో రిలీజ్ చేయడానికి.. స్టార్ హీరోయిన్ కోసం వెతికి వెతికి తమన్నాను ఫిక్స్ చేశాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. రచ్చ, సీటీమార్ సినిమాలు తమన్నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చిపెట్టాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబో ఓదెల 2 తో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

శివ శక్తి పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ సినిమా కోసం సంపత్ చాలా కష్టపడుతున్నాడు. హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఓదెల 2 క్లైమాక్స్  హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్‌లో షూట్ చేశారట. ఈ ఆలయాన్ని అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో మొత్తం 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు తమన్నా, ఇతర నటీనటులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.


Sanam Shetty: రాత్రుళ్లు రూమ్‌లో పడుకోవడానికి మాత్రమే రమ్మంటున్నారు.. మహేష్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం శరవేగంగా  షూటింగ్ జరుపుకుంటున్న ఓదెల 2 గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓదెల 2 టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారని సమాచారం.  ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెల్సిందే. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుకకు ప్రతి ఒక్కరు హాజరై పవిత్ర స్నానాన్ని ఆచరించి పాపాలను కడిగేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం మహాకుంభామేళాకు బారులు తీరుతున్నారు.

తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం ఓదెల 2 టీజర్ ను మహాకుంభామేళాలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 22 న ఓదెల  2 టీజర్ ను మహాకుంభామేళాలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటసన త్వరలోనే రిలీజ్ కానుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా లక్కీ. ఎవరికీ ఇలాంటి భాగ్యం దక్కదు. కానీ, తమన్నాకు ఈ ఛాన్స్ దక్కింది. దీంతో నెటిజన్స్ తమన్నాకు బెస్ట్ విషెస్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో తమ్ము బేబీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×