Official Announcement : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) ఇటీవలే ది గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అంతకు ముందు వచ్చిన లియో కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. అయినా సరే ఇప్పటికీ విజయ్ అభిమానులలో విజయ్ తదుపరి చిత్రం పై భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం. ప్రస్తుతం ఆయన 69వ సినిమా మొదలు పెట్టేశారు విజయ్. తన కెరీర్ లో ఇదే చివరి చిత్రమని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఓ రాజకీయ పార్టీ పెట్టిన విజయ్, ఈ 69 మూవీతో భారీ హిట్ కొట్టి, తన చివరి మూవీతో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
దళపతి 69 మొదలు…
దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో విజయ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ వినోత్ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు అనిరుధ్ అందించబోయే సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయట. ముఖ్యంగా అనిరుద్, విజయ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండడంతోనే మ్యూజిక్ రైట్స్ కోసం ఇప్పుడు గట్టి పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా…
ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర బృందం నుండి మరో అఫీషియల్ అనౌన్స్మెంట్ అభిమానులను సంతోషపరుస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోందని చిత్ర బృందం పోస్టర్ తో సహా షేర్ చేసింది. నిజానికి వీరిద్దరూ కలిసి గతంలో బీస్ట్ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే మళ్లీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు అంటూ చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చేసింది. ఇకపోతే పూజా హెగ్డే తో పాటు బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ లాంటి తదితర స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
కీ రోల్ లో మమితా బైజు…
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మలయాళ సినిమా ప్రేమలు ద్వారా సెన్సేషన్ గా మారిన మమితా బైజు కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఈమె కూడా నటిస్తోందని తెలియడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతేకాదు ఈ సినిమా తెలుగు సూపర్ హిట్ మూవీకి రీమేక్ అని ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎటువంటి క్లారిటీ లేదు.
చివరి సినిమా ఇదే..
ప్రస్తుతం ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది కానుందని , అంతేకాదు విజయ్ నటించే చివరి సినిమా కూడా కావచ్చని , ఆ తర ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాతే ఇక పూర్తి జీవితాన్ని రాజకీయాలలోనే గడపాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.