D55 Announcement : కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గత చిత్రం ‘రాయన్’ (Raayan) తో మరొ హిట్టును తన ఖాతాలో వేసుకున్న ఆయన లైనప్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తాజాగా ధనుష్ 55వ సినిమా (D55) పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది.
గత కొంతకాలంగా ధనుష్, ‘అమరన్’ (Amaran) డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ రోజు చెన్నైలో ధనుష్ 55వ సినిమా (D55)కు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ చిత్రానికి డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి (Raj Kumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నారు అంటూ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న ఈ మూవీకి గోపురం ఫిలిమ్స్ బ్యానర్ పై జి అన్బుచెజియన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియాసామి (Raj Kumar Periasamy) తాజాగా ‘అమరన్’ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సాయి పల్లవి (Sai Pallavi), శివ కార్తికేయన్ (Siva Karthikeyan) జంటగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ అయి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలాగే రాజ్ కుమార్ పెరియాసామిపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే ధనుష్ తో ఆయన నెక్స్ట్ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ మూవీకి ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు? సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మేకర్స్ నుంచి నెక్స్ట్ అప్డేట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సి.
మరోవైపు ధనుష్ (Dhanush) క్షణం తీరిక లేకుండా చేతిలో అరడజను సినిమాలకు పైగా లైనప్ తో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ‘ఎన్మెలే ఎన్నడి గోబం’, ‘ఇడ్లీ కడై’ (Idli Kadai) అనే రెండు చిత్రాలకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ‘ఇడ్లీ కడై’ మూవీని 2025 ఏప్రిల్ 10 న రిలీజ్ చేయనున్నట్టు ధనుష్ అధికారికంగా ప్రకటించారు. అంతలోనే D55 మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. వీటితో పాటు సంగీత విద్వాంసులు ఇళయరాజా బయోపిక్ (Ilayaraja Biopic) లో కూడా ధనుష్ నటించనున్నాడు. ఇలా చేతి నిండా ప్రాజెక్ట్‌లతో ఈ తమిళ స్టార్ బిజీ బిజీగా ఉన్నాడు.