Indian Railways Rules: భారతీయ రైల్వే సంస్థ నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను తమ గమ్యాలకు చేర్చుతుంది. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా వెళ్లే అవకాశం ఉంటడంతో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్లలో జర్నీ చేసినా, వారిలో 90 శాతానికి పైగా మందికి రైల్వే రూల్స్ గురించి పెద్దగా తెలియదు. అందుకే, రైలు ప్రయాణం చేసే వాళ్లు తరచుగా ఉపయోగపడే కొన్ని రూల్స్ తెలుసుకోవడం చాలా మంచిది.
RAC టికెట్స్ కన్ఫామ్ అయినా రైల్లో పడుకునే అవకాశం లేదా?
చాలా మంది ప్రయాణీకులకు RAC టికెట్స్ కన్ఫామ్ అవుతాయి. అయితే, రాత్రంతా కూర్చొనే ప్రయాణం చేయాలా? అనే ప్రశ్న కామన్ గా వస్తుంది. అయితే, టీటీఈ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాలి. అతడిని రిక్వెస్ట్ చేస్తే ఏదైనా సీటు ఖాళీగా ఉంటే, మీకు కేటాయించే అవకాశం ఉంటుంది. వెళ్లి ఆ సీటులో పడుకోవచ్చు. లేదంటే, సీటులో కూర్చోవాల్సి ఉంటుంది.
రైలులో టీటీఈ ఎక్కడుంటారు?
రైలు అన్నాక బోలెడు బోగీలు ఉంటాయి. వాటిలో టీటీఈ ఎక్కడుంటారో చాలా మందికి తెలియదు. అసలు ఒక రైలుకు ఒకే టీటీఈ ఉంటారా? ఎక్కువ మంది ఉంటారా? అనే విషయంలోనూ క్లారిటీ ఉండదు. అయితే, రైలు అంతటికీ ఒకే టీటీఈ ఉండరు. ఆయా రైలును బట్టి టీటీఈలు ఉంటారు. అంతేకాదు, మనం ఎలాగైతే టికెట్ బుక్ చేసుకుంటే బెర్త్ ఎలా కేటాయిస్తారో.. అలాగే టీటీఈలకు కూడా కొన్ని ప్రత్యేకంగా సీట్లు ఉంటాయి. ఆ సీట్లలో ఎక్కడో ఒకచోట టీటీఈ ఉంటారు. ఆ సఫరేటు సీట్లు ఎక్కడ ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు. ట్రైన్ అంతటికీ కలిపి ఒకే టీటీఈ ఉండరు. స్లీపర్ క్లాస్ లో ప్రతి 3 కోచ్ లకు ఓ టీటీఈ ఉంటాడు. సదరు టీటీఈ కూడా స్లీపర్ క్లాస్ లో సీట్ నెంబర్ 7లో కూర్చుంటారు. ఈ మూడు బోగీలలోని సీట్ నెంబర్ 7లో ఎక్కడో ఒకచోట ఉంటారు. ఏసీ క్లాస్ లో ప్రతి 5 కోచ్ లకు ఓ టీటీఈ ఉంటారు. సెకెండ్ క్లాస్ ఏసీ అయితే, A1 లేదంటే A2 కోచ్ లో సీట్ నెంబర్ 5లో ఉంటాడు. 3rd AC అయితే, 5 కోచ్ లలో ఏదో ఒక చోట సీట్ నెంబర్ 7లో కనిపిస్తారు. అవసరం అనుకుంటే, టీటీఈని కలిసి తన సమస్యను చెప్పుకునే అవకాశం ఉంటుంది. అతడి సూచనల ప్రకారం హ్యాపీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.
Read Also: రైల్వే టికెట్ బుకింగ్స్‌కు ఇక ‘సూపర్’ యాప్.. దీనికి, ఐఆర్‌సీటీసీ యాప్‌కు తేడా ఇదే!
ఈ సమాచారాన్ని రైళ్లో ప్రయాణించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భారతీయ రైల్వే సేవలు, ఇతర రూల్స్ గురించి మరిన్ని వివరాల కోసం బిగ్ టీవీ వెబ్ సైట్ ను చూస్తూ ఉండండి..
Read Also: ఈ రైలు వచ్చిందంటే.. వందే భారత్, రాజధాని ఎక్స్ ప్రెస్ కూడా పక్కకి తప్పుకోవల్సిందే!