Oh Bhama Ayyo Rama..యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas) ఇప్పుడు మరో అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రతిసారి ఏదో ఒక విభిన్నమైన స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న ఈయన.. తాజాగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిత్రంగా అనిపిస్తోంది.ఇందులో మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్(Malavika Manoj) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ బ్యూటీకి తెలుగులో మొదటి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇందులో అలీ (Ali), మొయిన్(Moin), బబ్లూ పృథ్వీరాజ్(Babloo Prithviraj), అనిత హస్పానందని, రవీందర్ విజయ్ తోపాటు పలువురు సెలబ్రిటీలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్యూర్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్..
రామ్ గోధల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేసింది .ముఖ్యంగా ఇతడు కూడా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా ఈ సినిమాతోనే పరిచయం కాబోతున్నారు. ఇక అలాగే హరీష్ నల్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రాణా దగ్గుబాటి (Rana Daggubati) ‘స్పిరిట్ మీడియా’ ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న పోస్టర్ రిలీజ్ చేయగా.. పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్లో సుహాస్ , మాళవిక మనోజ్ రొమాన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ కపుల్ అందించే లవ్ స్టోరీ భావోద్వేగాలను రేకెత్తించేలా ఉండనుంది అని, ముఖ్యంగా ఈతరం యువతకు విపరీతంగా కనెక్ట్ అవుతుందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Rajamouli: రమా రాజమౌళికి మాత్రమే నచ్చిన సినిమాలేంటో తెలుసా..?
‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ లాంఛ్ డేట్ ఫిక్స్..
రాధన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. తాజాగా సుహాస్, మాళవిక మనోజ్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. ఈ సినిమా టీజర్ లాంచ్ డేట్ ను ప్రకటించారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని.. మాళవికా మనోజ్ ఏదో తెల్ల కాగితంపై రాస్తున్నట్టు మనం చూడవచ్చు. ఆమెను చూసుకుంటూ ఆమె దగ్గరకు వచ్చిన సుహాస్.. నాకోసమే లవ్ లెటర్ ప్రిపేర్ చేస్తోంది అనుకుంటూ వచ్చి తెగ సంబరపడిపోయి ఆమె దగ్గర కూర్చుంటారు. ఏంటి దాచి పెట్టుకుంటున్నావ్.. చూపించొచ్చు కదా అంటూ అడగగానే.. నీకోసమే రాస్తున్నాను.. కాసేపు ఆగు అని మాళవిక మనోజ్ చెబుతుంది. ఇక తనకు లవ్ లెటర్ రాస్తోందేమో అని సంబరపడిపోతారు సుహాస్. మాళవిక ఆ పేపర్ సుహాస్ కి ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ పేపర్ చూడగానే సుహాస్.. “రామానాయుడు స్టూడియోలో మార్చి 24వ తేదీన ఉదయం 10 గంటలకు “ఓ భామ అయ్యో రామ” టీజర్ లాంచ్ ఫిక్స్” అంటూ అందులో రాసిన విషయాన్ని ఆడియన్స్ కి కూడా చదివి వినిపిస్తారు. వెంటనే మాళవిక ..”టైం కి వచ్చేయ్ .. మళ్లీ లేట్ చేయొద్దు” అంటూ చెప్పగానే.. సుహాస్ “అమ్మాయిల్ని నమ్మొద్దు బాబు.. రేపు ఈవెంట్ కి మాత్రం రండి బాబు” అంటూ టీజర్ లాంచ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. మొత్తానికి అయితే కొత్త స్ట్రాటజీని ఉపయోగించి సుహాస్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.