TTE Bribe Viral Video: తాజాగా ఓ రైలులో టీటీఈ, ప్రయాణీకుడి మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. సీట్ల కేటాయింపు కోసం TTE ప్రయాణీకుల నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. అయితే, ఈ ఘనటకు సంబంధించి ఓ ప్రయాణీకుడు వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో రికార్డింగ్ ను చూసిన TTE ఫోన్ ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, డ్యూటీలో ఉన్న TTE వీడియో తీస్తే ఏడు ఏండ్లు జైలు శిక్ష పడుతుందంటూ హెచ్చరించాడు.
TTE దబాయింపుకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన ప్రయాణీకుడు
TTE దబాయింపులకు వీడియో రికార్డు చేసిన ప్రయాణీకుడు గట్టిగా సమాధానం చెప్పాడు. వీడియో రికార్డు చేస్తే 7 ఏండ్లు జైలు శిక్ష విధించాలని ఎక్కడ రాసి ఉందో చూపించాలని డిమాండ్ చేశాడు. వెంటనే TTE ఎక్కడ ఉందో నేను మీకు చూపిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సదరు ప్రయాణీకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నది.
Kalesh inside indian Railways b/w TTE and Passenger over TTE got caught giving seats to passengers by taking money (full Context in the clip) pic.twitter.com/TH1E1S0bVn
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 1, 2025
Read Also: రైలు ప్రమాదాలు జరగకుండా రక్షణ’కవచ్’, కొత్త వెర్షన్ ఎలా పని చేస్తుందంటే?
TTE ఓవరాక్షన్ పై నిప్పుడు చెరుగుతున్న నెటిజన్లు
TTE తప్పు చేయడంతో పాటు తప్పుడు సమాచారంతో ప్రయాణీకుడిని బెదిరించడంపై నెటిజన్లు నిప్పులె చెరుగుతున్నారు. తప్పు చేయడమే కాకుండా, తప్పును ప్రశ్నించిన ప్రయాణీకుడిని బెదిరించడం ఏంటని మండిపడుతున్నారు. “TTE తప్పు చేశాడు. పైగా ఎదుటి వాళ్లు తప్పు చేశారు అన్నట్లు ఓవరాక్షన్ చేస్తున్నాడు” అంటూ మండిపడుతున్నారు. “ఇలాంటి వారిని కనీసం 10 సంవత్సరాల పాటు సర్వీసుకు దూరంగా ఉంచడం మంచిది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండటానికి కారణం ఇలాంటి ఉద్యోగులే” అంటూ మరో నెటిజన్ నిప్పులు చెరిగాడు. “నేను ఒడిశా రాష్ట్రం నుంచే వచ్చాను. TTEలు చాలా అవినీతి పరులు. ఇలాంటి వ్యక్తులు పలు నగరాల్లో ఫ్లాట్లు, ఇండ్లు కలిగి ఉన్నారు” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: హైదరాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు, మొత్తం ఎన్ని నడిపిస్తున్నారంటే?
నిజానికి ఒడిశా, చత్తీస్ గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో రైల్వే TTEలపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని చాలా మంది టికెట్ లేకుండా ప్రయాణం రైలు ప్రయాణం చేస్తుంటారు. వారి నుంచి TTE డబ్బులు తీసుకుని రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తారనే ఆరోపణులు ఉన్నాయి. నిజానికి టికెట్ లేని ప్రయాణీకులకు జరిమానా విధించడంతో పాటు ఎక్కిన స్టేషన్ నుంచి దిగే స్టేషన్ వరకు టికెట్ ఛార్జీ వసూళు చేయాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది రైల్వే TTEలు చేతివాటం ప్రదర్శిస్తారనే ఆరోపణుల ఉన్నాయి. తరచుగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ఆ ఆరోపణలు నిజమే అనే భావన కలుగుతున్నది.
Read Also: రైలు ప్రమాదాలు జరగకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారా? మీరు అస్సలు ఊహించి ఉండరు!