BigTV English

Pushpa 2: సుకుమార్ కు ఏమైంది.. భయమా.. భారమా.. ?

Pushpa 2: సుకుమార్ కు ఏమైంది.. భయమా.. భారమా.. ?

Pushpa 2: పుష్ప.. అల్లు అర్జున్.. సుకుమార్.. ఫైర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేర్లు తప్ప ఇంకేం కనిపించడం లేదు. పుష్ప 2 ..  రిలీజ్ కు రెడీ అవుతుంది.  ఎన్నో వాయిదాల తరువత డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ఇంకోపక్క రెండు రోజుల్లో రిలీజ్ ఉన్నా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలే ఉన్నాయని టాక్ నడుస్తోంది. అందుకే ప్రమోషన్స్ భారాన్ని మొత్తం  బన్నీనే భుజాన వేసుకున్నాడు.


ఇప్పటివరకు జరిగిన ప్రెస్ మీట్స్ కు కానీ, ఈవెంట్స్  కు కానీ సుకుమార్ అటెండ్ అయ్యిందే లేదు. గత రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా సుకుమార్.. ఏదో నామమాత్రానికి వచ్చినట్లు కనిపించాడు తప్ప.. ముఖంలో నవ్వు లేదు.  కనీసం ఫొటోలో కూడా ఆయన ముఖంలో నవ్వు కనిపించలేదు. మాట్లాడింది కూడా లేదు. అందులోనూ సుకుమార్ తన స్పీచ్ లో నిర్మాతలు ఎక్కువ మాట్లాడొద్దు అన్నారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమాకు కెప్టెన్ అంటే డైరెక్టర్ మాత్రమే. అలాంటి డైరెక్టర్ ను మాట్లాడనివ్వకుండా చేయడం ఏంటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Case on Pushpa 2: హైకోర్టులో ‘పుష్ప 2’ పై మరో కేసు.. దీనిపై హైకోర్టు ఏం చెప్పిందంటే.?


కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు. ఈవెంట్ మొత్తంలో సుకుమార్ పైనే అందరి చూపు పడింది. ఒక పాన్ ఇండియా సినిమా తీసిన ఆనందం కనిపించడం లేదు.  తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ముఖంలో నవ్వు లేదు. అల్లు అర్జున్ పక్కన ఉన్నా.. స్టేజి కింద సీట్ లో కూర్చున్నా.. ఏదో భయంగా ఉన్నట్లు కనిపించాడు. అయితే ఈ భయం దేనికి.. ? పుష్ప సినిమా సమయంలో సుకుమార్.

మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ పది రెట్లు ఎక్కువ ఉండబోతుందని చెప్పుకొచ్చాడు సుక్కు . పుష్ప 2 కూడా  అందుకు తగ్గట్టే తీర్చిదిద్దాడు.  మధ్యలో బన్నీతో విభేదాలు వచ్చినా.. సినిమా కోసం ఏదో విధంగా సర్ది చెప్పుకొని ఫినిష్ చేసాడు. అప్పుడు చెప్పినదానికన్నా.. ఇప్పుడు వెయ్యి రెట్లు ఇండస్ట్రీ ఈ సినిమాపై అంచనాలను పెట్టుకుంది. ఇదంతా చూసి.. వారి అంచనాలను అందుకోగలనా..? అనే భయం పట్టుకుందా.. ?

Sobhita Dhulipala-Naga Chaitanya wedding : చై-శోభిత పెళ్ళికి ఫస్ట్ గెస్ట్ కన్ఫర్మ్… ఇద్దరూ కలిస్తే జాతరే

బన్నీపై ఉన్న నెగెటివిటి  సినిమాపై ప్రభావం చూపించి రిజల్ట్ అటుఇటు వస్తే.. ట్రోల్స్ బన్నీ కంటే ఎక్కువ  సుకుమార్ పైనే వస్తాయి. అది కూడా ఆయన భయానికి కారణమా.. ? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం.. ఆ భయం లేదు.. సుక్కు కేవలం పని భారం వలనే అలా ఉన్నాడని చెప్పుకొస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకాఅవ్వకపోవడం, క్లైమాక్స్ ఎడిటింగ్ ఫినిష్ కాకపోవడం.. నిద్రలేకుండా పనిచేయడంతో సుకుమార్ అలా ఉన్నాడని అంటున్నారు.

వేదికపై ఆయనే  అలిసిపోయాను అని చెప్పారు కదా.. భయం ఎందుకు ఉంటుంది. మంచి సినిమా ఇవ్వాలంటే అంత భారం మోయక తప్పదు అని ఇంకొందరు అంటున్నారు. ఏదిఏమైనా కూడా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ కు ఏమైంది అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.  మరి సుకుమార్  భయం నిజమో కాదో తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×