Shine Tom Chacko: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అని, దానివల్ల ఎంతోమంది నటీమణులు వేధింపులకు గురవుతున్నారని చాలామందికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఒకప్పటి హీరోయిన్లు మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఈమధ్య చాలామంది దీనిపై ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా తమను ఇబ్బంది పెట్టిన వారిపై యాక్షన్ తీసుకోవడానికి కూడా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం మాలీవుడ్‌లో అదే జరుగుతోంది. మాలీవుడ్‌కు చెందిన ఒక యంగ్ హీరోయిన్.. సీనియర్ హీరో అయిన షైన్ టామ్ చాకోపై పలు ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు నిజమే అంటూ మరొక హీరోయిన్ తనకు మద్దతు పలకడానికి ముందుకొచ్చింది.
చేదు అనుభవం
తాజాగా షైన్ టామ్ చాకోతో పలు సినిమాల్లో కలిసి నటించిన విన్సీ అలోషియస్ (Vincy Aloshious) అనే నటి తనపై తీవ్ర ఆరోపణలు చేసింది. సినిమా సెట్స్‌లోనే తను డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బయటపెట్టింది. ఒకవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు డ్రగ్స్ ఆరోపణలతో షైన్ టామ్ చాకోను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే తను చట్టబద్ధంగా షైన్ టామ్ చాకోపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకోవడం లేదంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది విన్సీ. దీని గురించి పక్కన పెడితే.. మరొక హీరోయిన్ కూడా షైన్ టామ్ చాకో అలాంటి వాడే అంటూ తనకు జరిగిన అనుభవం గురించి బయటపెట్టింది.
డ్రగ్స్ అని చెప్పలేను
మాలీవుడ్ నటి అపర్ణ జాన్ (Aparna John) ఒక ఆస్ట్రేలియన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘‘చాకో గురించి విన్సీ చెప్పిందంతా నిజమే. తను నిజంగానే ఎప్పుడూ ఏదో వైట్ పౌడర్‌ను పీలుస్తూ ఉండేవాడు. కానీ అది వైట్ పౌడర్ అన్నది మాత్రమే నేను చూశాను. కచ్చితంగా అవి డ్రగ్స్ అని మాత్రం నేను చెప్పలేను. అది గ్లూకోజ్ కూడా అయ్యిండొచ్చు. సెట్స్‌లో చాకో ప్రవర్తన చాలా వింతంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. అసలు ఎవరూ మ్యాచ్ చేయలేని ఎనర్జీతో ఉండేవాడు. ఊరికే అటు, ఇటు తిరుగుతూ ఉండేవాడు. లాజిక్ లేకుండా మాట్లాడేవాడు. ఇంక అమ్మాయిలు తన పక్కన ఉంటే మాత్రం చాలా అసభ్యకరంగా మాట్లాడేవాడు’’ అని తెలిపింది అపర్ణ.
Also Read: నేను పాకిస్తానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ ఆవేదన, ఇంతకీ ఆమెది ఏ దేశం
ఫిర్యాదు చేశాను
‘‘విన్సీ చెప్పినట్టుగా చాకో చేసే కామెంట్స్ చాలా అసహ్యంగా, వికారంగా ఉండేవి. నేను ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను కాబట్టి తన ప్రవర్తన నాకు కూడా అసౌకర్యంగానే అనిపించింది. అందుకే నేను ఇంటర్నెల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు చేశాను. అందుకే నా సీన్స్‌ను, షెడ్యూల్‌ను వెంటనే పూర్తి చేయించి నన్ను పంపించేశారు. నాకు కూడా ఇండస్ట్రీలో అమ్మాయిల కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది. కానీ నేను ఆస్ట్రేలియాలో జీవించడం వల్ల నా అవకాశాలు చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది అపర్ణ జాన్. షైన్ టామ్ చాకో మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా ‘దసరా’, ‘దేవర’ లాంటి సినిమాల్లో నటుడిగా కనిపించాడు.