Colin Munro – Terror Attack: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ అనే పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఇప్పుడు ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఘటన వైరల్ గా మారింది. అన్యాయంగా 28 మంది పర్యాటకులను…. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో ఆ 28 మంది పర్యాటకుల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అయితే ఈ సంఘటన పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. పాకిస్తాన్ పై ఎదురుదాడి చేసేలా కనిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. న్యూజిలాండ్ కు చెందిన కోలిన్ మున్రో అనే స్టార్ క్రికెటర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Rohit Sharma :హైదరాబాద్ మెట్రోలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ రచ్చ…హిట్ మ్యాన్ అంటూ
పాకిస్తాన్ గడ్డపై ఇండియాకు మద్దతు ఇచ్చిన క్రికెటర్
జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో…. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో పిఎస్ఎల్ ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ మున్రో చేసిన పని పాకిస్తాన్ దేశానికి కోపం తెప్పిస్తోంది. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో టెర్రరిస్టుల అటాక్ కు వ్యతిరేకంగా కోలిన్ మున్రో… ఇండియాకు మద్దతు తెలిపాడు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో బ్లాక్ బ్యాడ్జి ధరించి… పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్లాక్ బ్యాడ్జి
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… న్యూజిలాండ్ క్రికెటర్ మున్రో ధరించిన బ్లాక్ బ్యాడ్జి పైన సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండియాకు మద్దతుగా బ్లాక్ బ్యాడ్జి ధరించాలని కొంతమంది అంటుంటే… అలా కాదు, వేరే సంఘటన నేపథ్యంలో మున్రో అలా ధరించి ఉంటాడని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి న్యూజిలాండ్ క్రికెటర్ మున్రో పాకిస్తాన్ గడ్డపై చేసిన… ఈ పని హాట్ టాపిక్ అయింది.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల రచ్చ
మంగళవారం రోజున జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు తగ్గించారు. అత్యంత దారుణానికి పాల్పడ్డారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకులు వచ్చిన విషయాన్ని గమనించారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలోనే ఆర్మీ అక్కడ లేని సమయం చూసి అటాక్ చేశారు. మంగళవారం రోజున ఏకంగా 28 మంది పర్యాటకులను చంపేశారు. చిన్నపిల్లలు అలాగే మహిళలను వదిలేసిన ఉగ్రవాదులు… కేవలం పురుషులను కాల్చి పొట్టన పెట్టుకున్నారు. అయితే ఈ ఉగ్రవాదుల చర్యకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా… పాకిస్తాన్ పై రివర్స్ అటాక్ చేయాలని సిద్ధమవుతోంది. ఇప్పటికే 1960లో ఏర్పడిన సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది.
Also Read: Threat to Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు
Why Colin Munro is wearing black armband during PSL match, is it for pahalgam terror attack or something else 🤔 just asking pic.twitter.com/JN0SQhJWIe
— Richard Kettleborough (@RichKettle07) April 24, 2025