BigTV English

AI : ఏఐతో శిశువు జననం.. హైటెక్ బిడ్డ పుట్టిందోచ్…

AI : ఏఐతో శిశువు జననం.. హైటెక్ బిడ్డ పుట్టిందోచ్…

AI : పెళ్లై ఏళ్లు గడుస్తున్నా కొందరికి పిల్లలు పుట్టరు. ఆ బాధ మామూలుగా ఉండదు. గుళ్లు, గోపురాలు తిరుగుతుంటారు. పూజలు, వ్రతాలు, హోమాలు చేస్తుంటారు. అయినా, దేవుడి దయ కలగదు. కొంతకాలం చూశాక హాస్టిటల్‌కు వెళతారు. డాక్టర్లు నానారకాల టెస్టులు చేస్తారు. ఏవేవో మందులు, ఇంజక్షన్లు ఇస్తారు. కొందరికి అవి ఫలిస్తాయి. మరికొందరికి మెడిసిన్‌తో పని అవ్వదు. అప్పుడిక IUI, IVF లే దిక్కు. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారే అది. IVF చాలా ఖరీదైన ప్రక్రియ. లక్షలలు ఖర్చవుతుంది. సక్సెస్ రేట్ మాత్రం 60 శాతమే. అలాంటి వారికి ఇప్పుడో గుడ్ న్యూస్. IVF లో AI టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇక ఫెయిల్యూర్స్ ఉండవు. సక్సెస్‌ఫుల్ బర్త్స్ సంఖ్య పెరుగుతుంది. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఏఐతో బేబీలను ఎలా పుట్టిస్తారు?


మెక్సికోలో మానవ ప్రమేయం లేకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ సాయంతో 40 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. న్యూయార్క్‌కు చెందిన వైద్యనిపుణులు ఈ ఘనత సాధించారు.

ఐవీఎఫ్ ఎలా చేస్తారు?


1990లో ఐవీఎఫ్‌ విధానం అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది దంపతులు పిల్లలను పొందారు. ఐవీఎఫ్‌లో మహిళ అండంలోకి మాన్యువల్‌గా వీర్యకణాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇందులో మొత్తం 23 దశలుంటాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ పద్దతిలో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రయత్నం మొత్తం వృథా అవుతుంది. అందుకే ఎక్స్‌పర్ట్స్ అయిన ఎంబ్రియాలజిస్ట్‌లు మాత్రమే ఈ ప్రక్రియ చేస్తారు.

ఐవీఎఫ్‌లో ఏఐ ఎలా యూజ్ చేశారు?

మెక్సికో మహిళ కేసులో ఆటోమేటెడ్ ఐవీఎఫ్‌ సిస్టమ్‌ను ఉపయోగించారు. దీని ద్వారా ఐసీఎస్‌ఐ ప్రక్రియలోని 23 దశలు మానవసాయం లేకుండానే చకచకా పూర్తికావడం విశేషం. 23 దశలనూ ఏఐ సాయంతో, డిజిటల్ కంట్రోల్ ద్వారా రోబోటిక్స్‌తో నిర్వహించారు. అండంలోకి వీర్యాన్ని నేరుగా ఇంజెక్ట్ చేసే ఐవీఎఫ్‌కు బదులుగా.. ఆటోమేటెడ్ ఐవీఎఫ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

Also Read : ఆ మహిళకు ప్రతీరోజూ పీరియడ్స్..

గేమ్ ఛేంజర్‌గా ఏఐ

ఈ ప్రక్రియలో నాణ్యమైన వీర్యకణాన్ని ఏఐ సాయంతో ఎంపిక చేస్తారు. లేజర్ సాయంతో దాన్ని కదలకుండా చేసి.. రిమోట్ డిజిటల్ కంట్రోల్‌ ద్వారా అండంలోకి చొప్పిస్తారు. దీనికి 9 నిమిషాల 56 సెకన్లు మాత్రమే టైం పట్టడం మరో ఆసక్తికర విషయం. ఏఐ ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతుంది అనడానికి ఈ ప్రయోగం ఓ నిదర్శనం. ఇది తొలి అడుగు మాత్రమేనని.. ముందుముందు వైద్యం విధానంలో ఏఐ గేమ్ ఛేంజర్ కాబోతోందని అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×