Robinhood OTT: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీలా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్ ‘.. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ – వెంకీ కాంబోలో గతంలో వచ్చిన భీష్మ భారీ హిట్ కొట్టింది. దీంతో వీరి కలయికలో వస్తున్న మూవీ పై చాలా హైప్ ఉంది.. మరోసారి భారీ హిట్ కొడతారనే అభిప్రాయం నితిన్ అభిమానుల్లో కలుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా హిట్ అవుతుందనే అభిప్రాయానికి జనాలు వచ్చేసారు. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ5 గ్రూప్ సొంతం చేసుకుంది. భారీ ధరకే మూవీ ఓటీటీ హక్కులు అమ్ముడు పోయినట్లు ఓ వార్త అయితే నెట్టింట ప్రచారంలో ఉంది. మరి ఎన్ని కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయో ఒకసారి చూసేద్దాం..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను మూవీ టీం విడుదల చేసింది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. అతని చేతుల మీదుగా సినిమా ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది.. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో, దేవ్‍దత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరవ్వడం గమనార్హం..
Also Read:బాక్సాఫీస్ ఊచకోత.. దుమ్ము దులిపేస్తున్న కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?
డిజిటల్ రైట్స్ విషయానికొస్తే..
రాబిన్‍హుడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. గతంలో నితిన్ నటించిన ఏ మూవీకి లేని విధంగా రాబిన్ హుడ్ ఓటీటీ రైట్స్ సేల్ అయ్యినట్లు మేకర్స్ అంటున్నారు. ఇకపోతే ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల జోరుగా బుకింగ్స్ సాగుతున్నాయి. క్రమంగా అన్ని చోట్ల ఈ మూవీ థియేటర్ల టికెట్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమాకు మ్యాడ్ స్క్వేర్ పోటీలో ఉంది. ఈ రెండు చిత్రాలు కామెడీ జోనర్ లో వస్తున్న నేపథ్యంలో కాస్త పోటీ గట్టిగానే ఉంది. మరి ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో..? ఏ మూవీ బోల్తా కొడుతుందో మూడురోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గత కొన్నేళ్లుగా నితిన్ ఖాతాలో హిట్ సినిమాలు లేవు. దాంతో ఈ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు. ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..