Telangana Cabinet Expansion : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఇంకా కొన్ని మంత్రి పదవులకు రాష్ట్రంలో అవకాశం ఉన్నా.. వివిధ కారణాలతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కానీ.. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన దిల్లీకి పయనమయ్యి వెళ్లారు. ఆయన దిల్లీ టూర్ వెనుక కొత్త మంత్రుల ఎంపిక నిర్ణయం ఉందంటున్నారు విశ్వసనీయ వర్గాలు. తెలంగాణ పీసీసీ, ప్రత్యేక పార్టీ బాధ్యుల నుంచి అనేక మార్లు వివరాలు తెప్పించుకున్న పార్టీ కేంద్ర కమిటీ.. ఎట్టకేలకు తెలంగాణలో పెండింగ్ లోని మంత్రుల పదవుల్ని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే.. సీఎం దిల్లీ పయనమవ్వగా.. నూతనంగా క్యాబినేట్ లోని ఆరుగురు కొత్తవారికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఎంత మందికి ఛాన్స్
భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య అసెంబ్లీ సభ్యుల మొత్తం సంఖ్యలో 15% మించకూడదు. ఈ లెక్కన తెలంగాణ క్యాబినేట్ లో గరిష్టంగా 18 మందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుంటుంది. ముఖ్యమంత్రి పదవితో సహా మరో పద్దెనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయొచ్చు. ప్రస్తుతానికి.. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో 12 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా.. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 2023 డిసెంబర్ 7న, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ఆ సంఖ్యను ఇప్పటి వరకు పెంచలేదు.
రేవంత్ టీమ్ లో కొత్త మెంబర్లు వీళ్లే..
అనేక దఫాలుగా రాష్ట్ర క్యాబినేట్ విస్తరణపై విస్తృతంగా చర్చలు నిర్వహించారు. అయినా.. ఇప్పటి వరకు ఈ అంశం కొలిక్కి రాలేదు. కులాలు, మహిళలు సహా అనేక పరిమితుల్ని పరిగణలోకి తీసుకుని.. పార్టీలో సమాలోచనలు చేస్తున్నారు. అలా.. పూర్తి స్థాయి సన్నదత పూర్తయ్యాక.. కొత్తగా ఆరుగురికి రేవంత్ టీమ్ లో అవకాశం కల్పించాలని పార్టీ, రాష్ట్ర, కేంద్ర కమిటీలు నిర్ణయానికి వచ్చాయి. దీంతో.. ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. కాగా.. మంత్రులుగా ప్రమాణ స్వీకరం చేయనున్న వారి పేర్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైంది.
Also Read : CM Revanth – TANA Event: సీఎం రేవంత్ చీఫ్‌గెస్ట్‌గా.. తానా అధికారిక ఆహ్వానం
అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితాలోని పేర్లను కుదించుకుంటూ వస్తున్నారు. అలా.. చివరికి 6 పోస్టులకు 8 మంది ఆశావాహులు పేర్లు ఖరారైయ్యాయి. వారిలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు లతో పాటుగా మహిళల కోటాలో విజయ శాంతి ని ఎంచుకోవాలని చూస్తుండగా.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కోసం వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అద్దంకి దయాకర్ పేర్లను.. మైనారిటీ కోటాలో పదవి కోసం అమీర్ అలీ ఖాన్ పేరును పరిశీలిస్తున్నారు.