Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోగా మారిపోయాడు. ఖాన్స్, కపూర్స్ అడ్డాలో అల్లు అర్జున్ కొత్త స్టార్ అయ్యాడు. నార్త్ బెల్ట్ లో పుష్ప 2 సృష్టించిన కలెక్షన్ల సునామీ చూస్తే అల్లు అర్జున్ అసలు తెలుగు హీరోనా లేక బాలీవుడ్ హీరోనా అనిపించకమానదు. ఆ రేంజ్ హిట్ ని సొంతం చేసుకున్న బన్నీ, ఇప్పుడు తన సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ఒకే చేసిన కమిట్మెంట్స్ ని వెనక్కి పుష్ చేసి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా సెట్ చేసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్.
అట్లీ – బన్నీ కాంబినేషన్ ఫిక్స్..!
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించనున్న భారీ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుండగా, ఇప్పటికే స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలైనట్లు టాక్. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ త్రివిక్రమ్ తో ప్లాన్ చేసిన సినిమాని కొంతకాలం పుష్ చేసినట్లు సమాచారం.
దుబాయ్ లో క్రేజీ మీటింగ్… బన్నీ కోసం సల్మాన్ రిజెక్ట్?
ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా ఫైనల్ చేసుకునేందుకు బన్నీ ఇటీవలే దుబాయ్ వెళ్లాడట. అక్కడ అట్లీతో కలిసి కథ గురించి డిస్కషన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ స్టోరీని మొదట అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి చెప్పాడట. కానీ కొన్ని కారణాల వల్ల సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆ తర్వాత ఈ కథ అల్లు అర్జున్ చేతికి వెళ్లింది.
పుష్ప 2 తర్వాత బన్నీ మాస్ స్టైల్..!
పుష్ప 2 తో మాస్ అండ్ రస్టిక్ లుక్ లో అలరించిన బన్నీ, అట్లీ సినిమా కోసం కొత్త అవతారంలో కనిపించనున్నాడని టాక్. అట్లీ సినిమాలంటే స్టైల్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్ మిక్స్ కాబట్టి, బన్నీ కొత్త తరహా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే, థెరి, మెర్శల్, జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అట్లీ ఈసారి మరింత హై ఓల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు?
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 మేనియా కంప్లీట్ గా సైలెంట్ అయిపొయింది కాబట్టి వీలైనంత త్వరగానే బన్నీ-అట్లీ మూవీపై అఫీషియల్ అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది. మరి అట్లీ తన స్టైల్ లో ఉండే సాలిడ్ ప్రాజెక్ట్ తో వస్తే, బన్నీ కెరీర్ లో ఇది మరో పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.