Parineeti Chopra: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు స్టార్ సెలబ్రిటీల మధ్య అయినా విభేదాలు ఉంటే అవి ఈజీగా బయటపడిపోతాయి. అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు వస్తే మాత్రం అది సోషల్ మీడియాలో, ప్రేక్షకుల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారుతుంది. వారి మధ్య విభేదాలు వచ్చాయని అనుమానాలు వచ్చినా కూడా అసలు ఏం జరిగిందని ఆరా తీయడానికి ప్రయత్నిస్తారు నెటిజన్లు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కుటుంబంలో అలాంటి విభేదాలే వచ్చాయని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి పరిణీతి డుమ్మ కొట్టడమే దీనికి కారణం. అంతే కాకుండా తాజాగా పరిణీతి చోప్రా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా నెటిజన్లలో మరింత అనుమానం కలిగేలా చేస్తోంది.
కుటుంబంలో కలహాలు
నిక్ జోనస్ అనే అమెరికన్ సింగర్, ఆర్టిస్ట్‌ను పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). అప్పటినుండి సినిమాలను కూడా దూరం పెట్టింది. ఇక కూతురు పుట్టిన తర్వాత పూర్తిగా ఫ్యామిలీ టైమ్‌లోనే బిజీ అయిపోయింది. ఇండియాలో ఎలాంటి ఫ్యామిలీ ఈవెంట్ జరిగినా కూడా ప్రియాంక మాత్రం ఇక్కడికి రాలేదు. అలాగే తన కజిన్ అయిన పరిణీతి పెళ్లికి కూడా రాలేదు. పరిణీతి పెళ్లికి రాకుండా అదే సమయంలో జరిగిన మరొక కమర్షియల్ ఈవెంట్‌కు ప్రియాంక హాజరు కావడంతో తనపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇప్పుడు పరిణీతి కూడా అదే చేస్తోంది. సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి రాకుండా తను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కోట్ చూస్తుంటే ఈ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయనే అనుమానం కలుగుతోంది.
వారినే ఎంచుకోవాలి
సిద్ధార్థ్ చోప్రా (Siddharth Chopra) పెళ్లిలో ప్రియాంక మరొక కజిన్ అయిన మన్నారా చోప్రా సందడి చేసింది. కానీ పరిణీతి ఈ పెళ్లిలో కనిపించకపోవడంపై ముందు నుండే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటి మధ్యలో తను షేర్ చేసిన పోస్ట్ మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ‘‘మనం అరువు తెచ్చుకున్న కాలంలో బ్రతుకుతున్నాం. మనల్ని ఎంచుకునే మనుషులనే మనం కూడా ఎంచుకోవాలి. మిగతా వారిని వారి దారిలో వారిని వదిలేయాలి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్ షేర్ చేసింది పరిణీతి చోప్రా. దీనిని ప్రియాంకతో విభేదాలకు కనెక్ట్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు.
Also Read: సైఫ్ పై జరిగిన కత్తి దాడి కేసులో అల్లు అర్జున్..మరి ఇంతగా పగ పట్టారేంట్రా..
దగ్గర్లోనే ఉన్నా
ఒకప్పుడు పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఢిల్లీలో ఉండేది. కానీ రాఘవ్ చడ్డాతో పెళ్లి తర్వాత ఎక్కువగా ముంబాయ్‌లోనే ఉంటుంది. ప్రస్తుతం దేవేన్ భోజనీతో ఒక మూవీ కూడా చేస్తోంది పరిణీతి. ప్రస్తుతం తను ముంబాయ్‌లోనే ఉన్నా, సిద్ధార్థ్ పెళ్లి కూడా అక్కడే జరుగుతున్నా కూడా పరిణీతి వెళ్లకపోవడంపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రియాంక.. పరిణీతి పెళ్లికి రాకపోవడం, ఇప్పుడు పరిణీతి.. సిద్ధార్థ్ పెళ్లికి రాకపోవడం చూస్తుంటే ఈ కుటుంబం మధ్యలో ఏదో కోల్డ్ వార్ నడుస్తుందేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఒక్కసారి సిద్ధార్థ్ పెళ్లిలో పరిణీతి కనిపిస్తే ప్రేక్షకుల అనుమానాలు చెక్ పడుతుంది.