BigTV English

Siddharth : సిద్ధార్థ్ కు అరుదైన వ్యాధి… జనాల వల్లే వచ్చిందట !

Siddharth : సిద్ధార్థ్ కు అరుదైన వ్యాధి… జనాల వల్లే వచ్చిందట !

Siddharth : సీనియర్ హీరో సిద్ధార్థ్ (Siddharth) తరచుగా వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి జనాల అటెన్షన్ వల్ల తనకొక అరుదైన వ్యాధి వచ్చింది అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. అసలు ఈ హీరోకి ఉన్న ఆ అరుదైన వ్యాధి ఏంటి? దీనివల్ల ఆయనకి ఎదురైన సమస్యలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.


సిద్ధార్థ్ కి అరుదైన వ్యాధి

సినిమా ఇండస్ట్రీకిలోకి నటీనటులు ఎవరైనా సరే మంచి ఫేం, ఫాలోయింగ్, గుర్తింపు రావాలన్న కోరికతోనే అడుగు పెడతారు. ఇక ఒక్కసారి ఆ క్రేజ్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫాలోయింగ్ వల్ల తనకు మాత్రం పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) అనే వ్యాధి వచ్చింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సిద్ధార్థ్. పైగా ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి తనకు 7 నుంచి 8 ఏళ్లు పట్టిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ (Siddharth) మాట్లాడుతూ తన భార్య, నటి అదితి రావు హైదరి తనకంటే ఎలా డిఫరెంట్ గా ఉంటుందో వెల్లడించారు. ఆమె స్పాట్లైట్ లో ఉండడన్ని బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పిన సిద్ధార్థ్, తన విషయంలో మాత్రం లైమ్ లైట్ అంటేనే టెన్షన్ గా ఉండేదని వెల్లడించారు.

సిద్ధార్థ (Siddharth) మాట్లాడుతూ “ఇలా స్టార్ స్టేటస్ అందుకోవడానికి చాలా కష్టపడ్డాను. అయితే స్టార్ అయ్యాక జనాలు వచ్చి నాతో మాట్లాడితే తెగ టెన్షన్ పడేవాడిని. అలా పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) లేకుండా జనాలతో మాట్లాడడానికి నాకు 7 నుంచి 8 సంవత్సరాలు పట్టింది. నా ఫ్యామిలీలో ఎవరూ ఇలాంటి టెన్షన్ ని ఫీల్ అవ్వలేదు. నేనైతే ఆ స్టార్ డంని ఆస్వాదించలేదు. అయితే ఈ స్టార్డమ్ అందుకున్నందుకు నువ్వు థాంక్ ఫుల్ గా ఉండాలి అని అనొచ్చు. కానీ ఇది దాని గురించి కాదు. నా మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి. నిజానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్టార్ డం వచ్చిందంటే వాటన్నిటిని మరిచిపోయి కృతజ్ఞతతో ఉండాలి. నేను ఈ విషయంలో థాంక్ ఫుల్ గానే ఉన్నాను. కానీ జనాల అటెన్షన్ కు అలవాటు పడడానికే నాకు చాలా సమయం పట్టింది” అంటూ ఎప్పటిలాగే తన స్టేట్మెంట్ ని సమర్దించుకున్నారు. 2003లో సిద్ధార్థ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇదే సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన గుర్తింపుతో ఆయన ఇలా ఇబ్బంది పడ్డారట.

అదితి రావు మాత్రం డిఫరెంట్

ఈ విషయం గురించి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) మాట్లాడుతూ “అతను అటెన్షన్ ను ద్వేషిస్తాడు. కానీ నేను మాత్రం చాలా ఇష్టపడతాను. జనాలు ఇంతగా మనల్ని ప్రేమించడం అదృష్టం. దర్శకుడు యాక్షన్ చెప్పడం, సెట్ లో ఉండడం, కెమెరా… ఇవన్నీ ఉంటే హ్యాపీగా ఉంటాను నేను” అని వెల్లడించింది. కాగా సిద్ధార్థ్ – అదితి రావు 2024 సెప్టెంబర్ 16న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×