Best Horror Movies: హారర్ సినిమాలను ప్రత్యేకంగా ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. భయపడుతూ అయినా హారర్ చిత్రాలను చూడడానికి ముందుకొచ్చేవారు కూడా ఉంటారు. అందుకే ఈ జోనర్‌లో సినిమాలు తెరకెక్కించడానికి కూడా చాలామంది మేకర్స్ ముందుకొస్తున్నారు. ఒకప్పుడు హారర్ అంటే అందులో దెయ్యాలు ఉండడం, ప్రేక్షకులను భయపెట్టడం వరకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు.. హారర్ అంటే దెయ్యాలు లేకపోయినా ఆడియన్స్‌ను భయపెట్టే ఒక ఎమోషన్. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌ను భయపెట్టి రెండు ఇండియన్ సినిమాలు ఆల్ టైమ్ రికార్డ్‌ను సాధించాయి.
అన్ని భాషల్లో హిట్
ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన హారర్ చిత్రాలకు రేటింగ్ ఇవ్వడానికి లెటర్ బాక్స్‌డ్ ముందుకొచ్చింది. ఇందులోని టాప్ 10 లిస్ట్‌లో ‘భ్రమయుగం’ కూడా ఉండడం విశేషం. అది కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన హారర్ సినిమాల్లో టాప్ 2వ స్థానాన్ని దక్కించుకుంది ‘భ్రమయుగం’. మమ్ముట్టి హీరోగా నటించిన ఈ మలయాళం హారర్ మూవీ.. 2024 ఫిబ్రవరీ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డిఫరెంట్ హారర్ సినిమాను మలయాళంలో మాత్రమే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ మూడు భాషల్లో సమానంగా ప్రమోషన్స్ చేసి ఎక్కువమంది ప్రేక్షకులకు దీనిని రీచ్ అయ్యేలా చేశారు.
Also Read: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే, ఇదొక ఓపెన్ సీక్రెట్.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
డిఫరెంట్ హారర్
‘భ్రమయుగం’ విడుదలయిన తర్వాత వెంటనే పాజిటివ్ టాక్ అందుకోవడంతో చాలామంది ప్రేక్షకులు ఈ మూవీ చూడడానికి ఆసక్తి చూపించారు. ఇదొక డిఫరెంట్ హారర్ అని పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన సోనీ లివ్‌లో విడుదలయిన తర్వాత ‘భ్రమయుగం’ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. దీనికి దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ కూడా మాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు తెచ్చిపెట్టింది ‘భ్రమయుగం’. ఈ మూవీ ఇప్పుడు ఏకంగా లెటర్ బాక్స్‌డ్ టాప్ 10 హారర్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఇక దీంతో పాటు ‘స్త్రీ 2’కు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను భయపెట్టిన హారర్ సినిమాల లిస్ట్‌లో టాప్ 23వ స్థానాన్ని దక్కించుకుంది ‘స్త్రీ 2’. దీంతో ఇండియన్ హారర్ మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
ఇప్పటికీ థియేటర్లలో
అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే ‘స్త్రీ 2’. ఈ సినిమా 2018లో విడుదలయిన ‘స్త్రీ’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. గట్టి పోటీ ఉన్న ఈ మూవీని ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల చేశారు. దీంతో పాటు విడుదలయిన సినిమాలను వెనక్కి నెట్టి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది ‘స్త్రీ 2’. దాదాపు నెలరోజుల పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌లో అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా పలు థియేటర్లలో ‘స్త్రీ 2’ రన్ అవుతూనే ఉంది. మొత్తానికి లెటర్ బాక్స్‌డ్‌లో చోటు దక్కించుకొని ‘భ్రమయుగం’, ‘స్త్రీ 2’ ఆల్ టైమ్ రికార్డ్‌ను అందుకున్నాయి.