Parvathy thiruvothu:సినిమా రంగం అనే కాదు ఏ రంగంలో అయినా సరే అణిగిమణిగి ఉంటేనే అవకాశాలు వస్తాయని అందరూ అంటూ ఉంటారు. కానీ కొంతమంది తాము ఇలాగే ఉంటాము అని, తమను తాము నిరూపించుకున్న సెలబ్రిటీస్ కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ కొంతమంది హీరోయిన్లు తమకు నచ్చిన పని చేస్తూ.. నచ్చకపోతే మొహం మీద డైరెక్ట్ గా చెప్పేసి, ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి హీరోయిన్స్ ఈతరంలోనే కాదు జమున (Jamuna), సావిత్రి(Savitri ) నాటి కాలం నుంచే ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా జమున, వాణిశ్రీ (Vani Sri) వంటి హీరోయిన్లను మొదలుకొని, కంగనా రనౌత్ (Kangana Ranaut), నేడు పార్వతి తిరువోతు (Parvathy thiruvothu) వరకు చాలామంది హీరోయిన్స్ నచ్చిన పని మాత్రమే చేస్తూ.. ఒకానొక దశలో ఇండస్ట్రీ బహిష్కరణ ఎదుర్కొని, ఇప్పుడు మళ్లీ తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారే నన్ను టార్గెట్ చేశారు..
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కంగనా తర్వాత పార్వతి పేరు అధికంగా వినిపిస్తోంది. తన అందంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది. కానీ మేల్ డామినేషన్ ను ప్రశ్నించే ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే సృజనాత్మక పరిశ్రమలో లౌక్యం చాలా అవసరం. అలాంటివి వారికి మాత్రమే ఇక్కడ అవకాశాలు ఉంటాయి మనుగడ ఉంటుంది. అందుకు భిన్నంగా రచ్చ చేసే నటీమణులను ఇండస్ట్రీ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి సమస్యనే మలయాళ పరిశ్రమలో పార్వతి ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ప్రశ్నించడం వల్లే అవకాశాలు కరువయ్యాయి – పార్వతి
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పార్వతీ తిరువోతూ వరుసగా హిట్ సినిమాలలో నటించింది. అయినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. “ఎంపికల విషయంలో సెలెక్టివ్ గా ఉండడం ఒక కారణమైతే, కొంతమంది హీరోలతో నేను నటించనని చెప్పడం మరో కారణం. అలాగే మలయాళ పరిశ్రమలో నేను ఎదుర్కొన్న ఇతర సవాళ్ల గురించి బహిరంగంగా చెప్పడం, విజయాలు అందుకున్నా.. పరిమితంగానే అవకాశాలు రావడానికి కారణం ఇదే. ముఖ్యంగా కొంతమందితో నేను నటించను అని చెప్పడం వల్ల నన్ను ఇండస్ట్రీ వాళ్ళు టార్గెట్ చేసి , అవకాశాలు ఇవ్వకుండా చేస్తున్నారు” అంటూ పార్వతి చెప్పుకొచ్చింది. పార్వతి మాట్లాడుతూ..” నాకంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. అందుకే కొందరిని కాదనుకొని ఇండస్ట్రీలో కొనసాగాలనే నిర్ణయంలో స్థిరంగా ఉన్నాను. కొన్ని ఎదురుదెబ్బలు, అవకాశాలు లేకపోవడం కూడా స్వావలంబన వైపు ఆలోచించేలా చేశాయి. అవకాశాలు కోల్పోవడం గురించి ఇప్పుడే కాదు గతంలో కూడా నేను మాట్లాడాను. ఇప్పటికీ ఒక కీలకమైన సమస్యగానే ఇది మారిపోయింది. పరిశ్రమలో ఒకరిని సైలెంట్ చేయడానికి అత్యంత ప్రతిభావంతమైన మార్గాలలో వారికి అవకాశాలు లేకుండా చేయడం అని నేను నమ్ముతాను. ఎవరైనా సరే అవకాశాలు లేకపోతే తమ ప్రతిభను నిరూపించుకోలేరు అటు తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటించినా.. మలయాళం లో నాకు లభించిన అవకాశాలు.. నేను ఊహించిన దాని కంటే చాలా తక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా హీరోలే కాదు సాంకేతిక నిపుణులు కూడా అవకాశాలు రాకుండా చేస్తారు అంటూ పార్వతి చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ప్రశ్నించడం వల్లే తనకు అవకాశాలు లేవని డైరెక్ట్ గానే చెప్పేసింది పార్వతి తిరువోతు.