Sharwanand : రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్లు వరుస సినిమాలను లైన్లో పెడుతూ, భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. కానీ కొంతమంది యంగ్ హీరోలు మాత్రం ఇంకా వీరి స్పీడును అందుకోలేక వెనుకబడి పోతున్నారు. అందులో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకరు. ఇప్పటికే రెండు సినిమాలను లైన్లో పెట్టారు శర్వానంద్. కానీ ఆ రెండు సినిమాలు కూడా పలు సమస్యల కారణంగా ఆగిపోయే పరిస్థితిలో ఉండగా, తాజాగా ఆయనకి బిగ్ రిలీఫ్ దొరికింది.
రెండు సినిమాలకూ ఇబ్బందులే
శర్వానంద్ కు చాలా కాలంగా భారీ హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. అయినప్పటికీ ఆయనకు అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. అదే టైంలో శర్వానంద్ పారితోషికం విషయంలో కఠినంగా ఉంటాడనే టాక్ కూడా ఉంది. పెద్దగా హిట్స్ లేకపోయినప్పటికీ శర్వానంద్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది నిర్మాతలకు కాస్త ప్రెజర్ గానే ఉంటుంది. అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి సాహసం చేస్తున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం శర్వానంద్ రెండు సినిమాల షూటింగ్లో మొదలు పెట్టాడు. కానీ ఈ రెండు సినిమాలు కూడా వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యాయి.
శర్వానంద్ నెక్స్ట్ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా, దీనికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా ఆల్మోస్ట్ ఆగిపోయింది అనే టాక్ ఉంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ అక్టోబర్లో జరిగింది. ఇంకా మూవీ షూటింగ్ పెండింగ్ లోనే ఉన్నప్పటికీ, రిలీజ్ డేట్ గురించి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు థియేట్రికల్ డీల్స్ ను ముగించడానికి మేకర్స్ షూటింగ్ ను పూర్తి చేసి టీజర్, పాటలను ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. అలాగే శర్వానంద్ గత సంవత్సరం మొదలు పెట్టిన అభిలాష రెడ్డి మూవీ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది.
శర్వానంద్ స్పోర్ట్స్ డ్రామా రీస్టార్ట్
శర్వానంద్, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు. గత ఏడాది ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టారు. అయితే మెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ షూటింగ్ కూడా వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. కానీ ఎట్టకేలకు శర్వానంద్ తిరిగి ఈ మూవీ షూటింగ్ ను మొదలు పెట్టాడు. రీసెంట్ గా ఆయన ఈ మూవీ షూటింగ్ కోసం ఇండోనేషియా కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఇంటెన్స్ బైక్ రేస్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయని ఈ మూవీలో శర్వానంద్ బైక్ రేసర్ గా నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ మూవీని వేసవి తర్వాత రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగిపోయాయి అనుకొన్న ఆ రెండు సినిమాలలో ఓ మూవీ తిరిగి మొదలు కావడం అనేది శర్వానంద్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.