Nayanthara Dhanush: సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు పుట్టుకొస్తుంటాయి. ఒక వివాదం ముగిసిపోగానే ప్రేక్షకులు చర్చించుకోవడానికి మరొక వివాదం రెడీగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కాంట్రవర్సీ నయనతార, ధనుష్. ఇటీవల నయనతార పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌పై తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్’ విడుదలయిన తర్వాత నుండి ఈ కాంట్రవర్సీ మొదలయ్యింది. అసలు ఈ కాంట్రవర్సీ ఇంత పెద్దగా ఎందుకు అవుతుంది అని చాలామంది ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో క్లారిటీ రాకముందే మధ్యలో ఒక హీరోయిన్ జోక్యం.. ఈ వివాదాన్ని మరింత పెద్దగా చేయనుంది.
వివాదంలో మలుపు
ఒక వ్యక్తిపై డాక్యుమెంటరీ తెరకెక్కించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ డాక్యుమెంటరీలో ఒక వ్యక్తి పేరు ఉపయోగించినా కూడా వారి దగ్గర నుండి కచ్చితంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తీసుకోవాలి. అలాగే నయనతార డాక్యుమెంటరీలో ఎవరెవరి పేరు అయితే ఉపయోగించారో అందరి దగ్గర నుండి ఈ ఎన్ఓసీ ఫార్మ్ లభించింది. ఒక్క ధనుష్ దగ్గర నుండి తప్పా. దీంతో తన పేరు ఉపయోగించడానికి తను పర్మిషన్ ఇవ్వలేదంటూ ధనుష్ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చాడు. నయనతార కూడా ఈ విషయంపై ఒక ఓపెన్ లెటర్‌ను విడుదల చేయగా తనకు సపోర్ట్ చేయడానికి ఒక నటి ముందుకొచ్చింది.
Also Read: మహానటి కట్నంగా ఎంత తీసుకెళ్తోందో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.!
మాటల్లో నిజాయితీ
నయనతార (Nayanthara) లాగానే మరొక నటి జీవితంలో కూడా చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. తనే పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu). పార్వతి పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటికి రాకపోయినా ప్రొఫెషనల్ లైఫ్‌లో తను ఇచ్చే స్టేట్‌మెంట్స్ తనను చాలాసార్లు చిక్కుల్లో పడేశాయి. అయినా కూడా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆపలేదు ఈ నటి. అదే విధంగా తాజాగా నయనతార, ధనుష్ (Dhanush) వివాదంలో కూడా తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేసింది. ‘‘నయనతార ఒక సెల్ఫ్ మేడ్ స్టార్. తన మాటలకు చాలా విలువ ఉంటుంది. నేను తన ఓపెన్ లెటర్ చదివినప్పుడు తనకు సపోర్ట్ చేయడం ముఖ్యం అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది పార్వతి.
సపోర్ట్ కావాలి
‘‘ఒంటరి అయిపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒకరి సపోర్ట్ వల్ల ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. అందుకే నేనెప్పుడూ నిజం మాట్లాడేవాళ్లకు అండగా నిలబడతాను’’ అంటూ తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకుంంది పార్వతి తిరువోతు. ఇక నయనతార, ధనుష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పార్వతి కూడా జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం నయనతారదే తప్పు అని తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్‌తో నటించడం వల్లే నయన్‌కు స్టార్‌డమ్ వచ్చిందని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు తనతో నటించి స్టార్‌డమ్ సంపాదించుకొని ఇప్పుడు తనపైనే రివర్స్ అవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు.