Pavitra Lokesh: కన్నడ ముద్దుగుమ్మ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2023లో ఈమె పేరు ప్రతిరోజు సోషల్ మీడియాలో వినిపించేది. అటు మీడియా వర్గాల్లో కూడా పవిత్ర లోకేష్ పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్ నటుడు నరేష్ తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇద్దరూ ఒక హోటల్ రూమ్ లో కనిపించారు. దాంతో వీరిద్దరూ నిజంగా నేను రిలేషన్ లో ఉన్నారంటూ కన్ఫామ్ అయిపోయింది. ఇక దాచడం కుదరక ఓపెన్ అయిపోయారు ప్రేమజంట. మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని పెళ్లి చేసుకుంటామని చెప్పి మరీ అందరికీ సడెన్ షాక్ ఇస్తూ పెళ్లి చేసుకున్నారు.. వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.. అయితే తాజాగా పవిత్ర లోకేష్ గురించి ఓ సంచలన నిజం బయటపడింది. అసలేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
నరేష్ కంటే ముందు ఆ హీరోను ప్రేమించాను..
తెలుగు సినిమాల్లో హీరోయిన్ కు, హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది పవిత్రా లోకేష్.. ఈమె నిజానికి కన్నడి అయినా కూడా తెలుగు వరుస సినిమాలు చేస్తూ ఫెమస్ అయ్యింది. గతంలో సినీ నటుడు నరేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. స్క్రీన్ మీద భార్యాభర్తలు గా ఉన్న వీళ్ళిద్దరూ నిజజీవితంలో కూడా భార్యాభర్తల అవ్వాలని అనుకున్నారు. కొన్నాళ్లు రిలేషన్ లో ఉండి ఈమధ్య మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత ఇద్దరు పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారని తెలుస్తుంది.
అందులో ఆమె మాట్లాడుతూ.. నరేష్ మీ క్రష్ నా అని అడిగితే.. నా మొదటి క్రష్ నాగార్జున నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు, నాగార్జున అంటే నాకు చాలా ఇష్టం. తన జీవితంలో అలాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని తాను భావించానని వెల్లడించారు. నాగార్జున అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగార్జున తర్వాత ప్రకాష్ రాజ్ ని చూసినప్పుడు తనకు కూడా అలాగే అనిపించిందని పవిత్ర అన్నారు.. ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:శ్రీముఖిని పుల్లతో పోలుస్తూ.. అడ్డంగా పరువు తీసిన కమెడీయన్..
గతంలో నరేష్ ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పాడు.. పవిత్రా నా జీవితంలోకి వచ్చాక నా జీవితం బాగుపడింది. టైటానిక్ ఓడ ఒడ్డుకు చేరినట్టు అయింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు. నా జీవితం ఇప్పుడు టైటానిక్ ఓడ ఒడ్డుకు చేరినట్టు అయింది. మన జీవితంలో అర్థం చేసుకునేవాళ్ళు ఉంటే అంతా మంచిదే జరుగుతుంది అని నరేష్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నరేష్ ఈమధ్య ప్రధానపాత్రలో పలు సినిమాల్లో నటించారు..