BigTV English

Sujeeth: ఓర్నీ సుజీత్.. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా ఫేవరెట్ ఏంటయ్యా బాబు… ఓజీ తేడా కొట్టదు కదా?

Sujeeth: ఓర్నీ సుజీత్.. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా ఫేవరెట్ ఏంటయ్యా బాబు… ఓజీ తేడా కొట్టదు కదా?

Sujeeth:  టాలీవుడ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఓజీ సినిమా(OG Movie) పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. చిన్నప్పటినుంచి సినిమాలు అంటే ఎంతో ఆసక్తి ఉన్న సుజీత్ చెన్నైలోని ఎల్వీ పసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ నుంచి డిగ్రీ పొందారు. ఇలా డిగ్రీ పట్టా పొందిన తర్వాత పలు షార్ట్ సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించిన, సుజీత్ 2014వ సంవత్సరంలో శర్వానంద్ హీరోగా చేసిన రన్ రాజా రన్ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న సుజీత్ ఏకంగా ప్రభాస్ తో సాహో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నార్త్ ఇండస్ట్రీలో మాత్రం అదిరిపోయే ఆదరణ సొంతం చేసుకుంది.


ఫ్లాప్ మూవీ ఫేవరెట్ ఏంటయ్యా..

ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తికావచ్చింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా కూడా ఇప్పటికే  ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కారణంగా ఆలస్యం అవుతుంది.  ఇదిలా ఉండగా త డైరెక్టర్ సుజీత్ ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.


జానీ సినిమా చాలా ఇష్టం….

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో కార్తికేయ డైరెక్టర్ సుజీత్ ను ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలలో మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వెంటనే సుజీత్ జానీ (Johnny)సినిమా అంటూ షాకింగ్ సమాధానం ఇచ్చారు. అదేంటి ఏ గబ్బర్ సింగ్, ఖుషి అని చెబుతారు అనుకున్నా కానీ జానీ సినిమా పేరు చెప్పారేంటి అంటూ కార్తికేయ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుజీత్ సమాధానం చెబుతూ.. జానీ సినిమాలో జన్యునిటీ ఉంది. నేను ఈ సినిమాని అనంతపూర్ లో చూశాను. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే మనకు నిద్ర పట్టేది కాదు.

జానీ సినిమా విడుదల కాగానే పవన్ కళ్యాణ్ జానీ అని బ్యాండ్ కట్టుకున్నట్టు నేను కూడా ఆ బ్యాండ్ కట్టుకొని సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూశాను. ఇక తలకు కట్టిన ఆ బ్యాండ్ ఏడు రోజులపాటు అలాగే ఉంచుకున్నానని, నిద్రపోయేటప్పుడు కూడా  అలాగే ఉండేదని తెలిపారు. ఈ విషయం నేను కళ్యాణ్ గారితో చెబితే అలా ఎలా ఉన్నావయ్యా అంటూ మాట్లాడారు. ఇప్పుడు మనకు తెలియదు కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఎడిటింగ్ కానీ ఇతర విషయాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే నాకు జానీ ఫేవరెట్ సినిమా అంటూ సుజీత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అదేంటి భయ్యా ఫ్లాప్ సినిమా ఫేవరెట్ అంటున్నావ్.. ఓజీ సినిమా తేడా కొట్టదు కదా అంటూ పవన్ అభిమానులు ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×