Viral Video: విమానాశ్రయాల్లో తరచుగా అక్రమంగా బంగారం రవాణా చేస్తూ ప్రయాణీకులు అధికారులకు చిక్కుతారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడుతారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి పాములను రవాణా చేస్తూ దొరకడం సంచలనం కలిగించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40కి పైగా అరుదైన విషపూర్తి పాములను దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే
థాయ్ లాండ్ నుంచి ఇండియాకు పాముల తరలింపు
ఇండియాకు చెందిన సదరు ప్రయాణీకుడు థాయ్ లాండ్ నుంచి తిరిగి వస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. 47 విషపూరిత పాములను ఆ వ్యక్తి చెక్ ఇన్ చేసి లగేజీలో దాచి ఉంచినట్లు గుర్తించారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడిని పోలీసులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో అతడి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కానీ, కస్టమ్స్ అధికారులు ఒక డిష్ లో తిరుగుతున్న రంగు రంగుల పాములకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రయాణీకుడి నుంచి స్వాధీనం చేసుకున్న పాములలోమూడు స్పైడర్-టెయిల్డ్ హార్న్డ్ వైపర్లు, ఐదు ఆసియా లీఫ్ తాబేళ్లు, 44 ఇండోనేషియా పిట్ వైపర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ పాములు ఎలా వచ్చాయి?
దేశంలోకి పాములను తీసుకురావడం చట్టవిరుద్ధం కానప్పటికీ, దేశ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కొన్ని జాతుల దిగుమతిపై నిషేధం విధించింది. వాటిలో అంతరించిపోతున్న లేదంటే రక్షించబడినవిగా వర్గీకరించబడినవి ఉన్నాయి. ఏదైనా వన్యప్రాణాలను దిగుమతి చేసుకునే ముందుకు సదరు ప్రయాణీకుడు అవసరమైన అనుమతులు, లైసెన్సులు తీసుకోవాలి. నిషేధిత వన్యప్రాణులను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయాణీకుల నుంచి కస్టమ్స్ అధికారులు తరచుగా స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. వాటిని ఎవరి నుంచి ఎలా తెస్తున్నాడు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
On 01.06.2025, officers at CSMIA seized 3 Spider-Tailed Horned Vipers & 5 Asian Leaf Turtles (CITES Appendix-II), along with 44 Indonesian Pit Vipers, concealed in checked-in baggage. An Indian national arriving from Thailand was arrested. pic.twitter.com/C07R2Y58ZX
— Mumbai Customs-III (@mumbaicus3) June 1, 2025
కెనెడియన్ వ్యక్తి నుంచి మొసలి పుర్రె స్వాధీనం
ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక కెనడియన్ వ్యక్తి తన లగేజీలో మొసలి పుర్రెను తీసుకెళ్లడాన్ని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముంబై విమానాశ్రయంలోని అధికారులు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అడవులకు చెందిన ఐదు సియామాంగ్ గిబ్బన్ లను తీసుకెళ్తున్న ప్రయాణీకుడిని పట్టుకున్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అంతరించిపోతున్నట్లు గుర్తించిన గిబ్బన్ లను ప్రయాణీకులు ట్రాలీ బ్యాగ్ లోపల ఉంచిన ప్లాస్టిక్ క్రేట్ లో దాచిపెట్టారు. అదే సమయంలో 12 ఇతర దేశాలకు చెందిన తాబేళ్లను బ్యాంకాక్ నుంచి తీసుకొస్తూ ఇద్దరు ప్రయాణీకులు పట్టుబడ్డారు. 2019లో చెన్నై విమానాశ్రయంలో థాయిలాండ్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి నుంచి పిట్ వైపర్ పాము, ఐదు ఇగువానాలు, మూడు ఆకుపచ్చ చెట్ల కప్పలు మరియు 22 ఈజిప్షియన్ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: గాలి దుమారంలో విమానం, వణికిపోయిన ప్రయాణీకులు, నెట్టింట వీడియో వైరల్!