Northeastern States: ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. గ్యాప్ లేకుండా వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏకధాటి వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా సిక్కిం రాష్ట్రంలో ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్ పై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.
నిన్న రాత్రి భారీ వర్షం దంచికొట్టింది. ఈ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. చనిపోయిన భద్రతా సిబ్బందిని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురు బయటపడ్డారు. ఇక ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు నిర్వీరామ్యంగా శ్రమిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
ALSO READ: C-DAC Recruitment: సీడ్యాక్‌లో 848 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు..
ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా రావడంతో.. బంగ్లాదేశ్, మేఘాలయలపై అల్పపీడనం ఏర్పడడం వంటి కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. అస్సాంలో నిన్న ఏడు ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వరద జలాలతో సుమారు 4 లక్షల మంది ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. గౌహతిలో 24 గంటల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక త్రిపుర రాజధాని అగర్తలలో వర్షం దంచికొట్టింది. వర్షంతో ఓ వ్యక్తి మ్యాన్ హోల్‌లో పడి చనిపోయాడు. అక్కడ మూడు గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
ALSO READ: Corona: 3900 కరోనా కేసులు, ఇప్పటివరకు 32మంది మృతి.. ఈ కొవిడ్ డేంజర్ భయ్యా