Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ టైమ్స్ లో సినిమాలు మీద ఆసక్తి తగ్గిపోయింది గాని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలు మీద ఉండే డెడికేషన్ వేరు. గంటలు గంటలు ఎడిట్ రూమ్ లో కూర్చుని సినిమాను చెక్కిన రోజులు కూడా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు మూడు సినిమాలు చేశారు. ఆ మూడు సినిమాలు కూడా రీమేక్ సినిమాలు. అయితే ఏ సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలు దాదాపు 4 వరకు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు గురించి త్వరలో క్లారిటీ రావాల్సి ఉంది.
నిర్మాతలను పిలిచి మాట్లాడారు
ఇక పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉంచిన సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. నిన్న మైత్రీ నవీన్, డీవీవీ దానయ్య లను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం వినిపిస్తుంది. జూలై నుండి ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్లు… అదే పవన్ కళ్యాణ్ చివరి సినిమా అని కూడా తెలుస్తుంది. జూలై లోగానే ఓజి సినిమాను కూడా పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది కాలంలో ఆ రకంగా పవన్ నుండి మూడు సినిమాలు మొత్తానికి ఈ రకంగా పవన్ కళ్యాణ్ నుంచి పిలుపురావటం అనేది నిర్మాతల్లో కొత్త జోష్ నింపింది. కేవలం నిర్మాతల్లో మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను పూర్తి చేసి కంప్లీట్ గా రాజకీయాల్లో బిజీగా కానున్నట్లు అర్థమవుతుంది.
అన్ని అంచనాలు ఈ రెండు సినిమాలపై
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నిటికంటే కూడా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. స్వతహాగా హరీష్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో ఎవరు మర్చిపోలేని సినిమా అంటే గబ్బర్ సింగ్ అని చెప్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకుమించి హరీష్ శంకర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
Also Read : Harish Shankar : పక్క సినిమాలను ఎంకరేజ్ చేయడం మనకు అలవాటే కదా