Harish Shankar : తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు చూస్తారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత భాష అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ సినిమాలు చూడటం అలవాటైంది. చాలా మలయాళం సినిమాలు తెలుగు డబ్బింగ్ థియేటర్లో కూడా విడుదలవుతున్నాయి. కొంతమంది డైరెక్ట్ గా మలయాళం సినిమాలను కూడా చూస్తున్నారు. రీసెంట్ గా చాలా మలయాళం సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. యూత్ కి బాగా కనెక్ట్ అయిన సినిమా ప్రేమలు. ప్రేమలు సినిమా తర్వాత నస్లీన్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు నస్లీన్ నటించిన జింఖానా సినిమా త్వరలో థియేటర్లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్లో ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు.
పక్క సినిమాలను ఎంకరేజ్ చేస్తాం
ఈ సినిమా ఈవెంట్ కు హరీష్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హరీష్ మాట్లాడిన ప్రతిసారి ఎంత ఆసక్తికరంగా ఉంటుందో తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా విషయంలో కూడా పక్క సినిమాలను ఎంకరేజ్ చేయడం మనకు అలవాటే కదా, మన సినిమాలు మనం చూడకపోయినా కూడా పక్క సినిమాలు చూస్తూ ఉంటాం అంటూ మరోసారి చెబుతూ వచ్చాడు. ఇదివరకే తమిళ్ డ్రాగన్ సినిమా వచ్చినప్పుడు ఇలానే చెప్పాను. చాలామంది నా గురించి వాళ్ళకి నచ్చినట్టుగా గాసిప్స్ రాసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా అలానే చెబుతున్నాను. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది మీకు నచ్చినట్టు రాసుకోండి. పక్క సినిమాలను ఎంకరేజ్ చేయడం మనకు అలవాటే కాబట్టి ఈ సినిమాను కూడా చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : Manchu Vishnu: ‘కన్నప్ప’ను టార్గెట్ చేసిన వైసీపీ.. మంచు విష్ణు ట్వీటే కారణమా.?
మిస్టర్ బచ్చన్ డిజాస్టర్
హరీష్ శంకర్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాక్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న హరీష్, మిరపకాయ సినిమా తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక గబ్బర్ సింగ్ సినిమా ఎటువంటి ఫలితాన్ని సాధించిన్న అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకున్నాయి. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఊహించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్. దీనికి సంబంధించిన వీడియో కూడా మంచి అంచనాలను రేకెత్తించింది.
Also Read : Kalki 2 : కల్కి 2 రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసిన నాగ్ అశ్విన్