Telugu Heros ..సాధారణంగా హీరోలను ఎప్పుడూ ఒకే తరహాలో చూపిస్తే ఆడియన్స్ కి కూడా బోర్ కొడుతుంది.. అందుకే డైరెక్టర్లు హీరోల చేత ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయోగాల వల్ల ఆ హీరోలకి ఒక్కోసారి పేరు రావచ్చు.. లేదా బెడిసి కొట్టి ట్రోల్స్ కూడా ఎదుర్కోవచ్చు. అలా డైరెక్టర్స్ చేసిన పని వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు పడ్డ హీరోలు కూడా ఉన్నారు. ఇక అలాంటి ప్రయోగాలలో యాస కూడా ఒకటి. మొదటిగా మనకు ఈ యాస విషయానికి వస్తే.. తెలంగాణ యాసలో అదిరిపోయే డైలాగులతో తెలంగాణ యాసకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు శకుంతల(Telangana Shakuntala). తర్వాత జయప్రకాశ్ రెడ్డి (Jayaprakash Reddy). రాయలసీమ యాస మాట్లాడాలి అంటే ఈయన తర్వాతే ఎవరైనా. ఇక శ్రీకాకుళం యాసలో కొంతమంది ట్రై చేశారు. కానీ అలాంటి వారిలో తండేల్ మూవీలో నాగచైతన్య(Naga Chaitanya), కేరింత సినిమాలో పార్వతీశం (Parvateesam) లాంటి వాళ్లకు బాగా సెట్ అయింది.
అలవాటు లేని యాసతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరోలు..
ఇక మిగతా వారి విషయానికొస్తే.. ముఖ్యంగా యాస అనేది పర్ఫెక్ట్ గా పలికితేనే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అలవాటు లేని యాసను మాట్లాడమని చెప్పి.. హీరోలతో ఈ ప్రయోగాలు చేయడం ఎంతవరకు కరెక్ట్.. అసలు మొన్న చిరంజీవి(Chiranjeevi ) కూడా ఒక యాస ట్రై చేశారు. దానిపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి కూడా.. ఇలా ఒక హీరోనే కాదు చాలామంది సినిమా కోసం తమకు రాని యాసలను ట్రై చేసి ఆఖరికి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ (Ram Charan) పెద్ది(Peddi ) సినిమాలో యాస ఆయనకు బాగా సెట్ అయింది. కానీ తాజాగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న ‘లెనిన్’ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. అఖిల్ యాస పెద్దగా సెట్ అవ్వలేదు. కథ, నేపథ్యం అంటూ హీరోల చేత డైరెక్టర్లు ఈ యాస ప్రయోగాలు చేయించి ,హీరోలను ట్రోల్స్ కి గురయ్యేలా చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
also read :Odela 2 Story : ఓదెల 2 స్టోరీ ఇదే… బిగ్ టీవీ ముందే చెప్పింది
ఇకనైనా డైరెక్టర్లు ప్రయోగాలు చేసేటప్పుడు ఆలోచిస్తారా…?
మొత్తానికి అయితే ప్రేక్షకులను మెప్పించడానికి, అటు హీరోలు ఇటు దర్శకులు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రయోగాలు వారికి సెట్ అవ్వాలి. అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక సెట్ కాని ప్రయోగాలు ఎన్ని చేసినా విమర్శలకు దారి తీయడమే తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇకనైనా దర్శకులు.. హీరోలు తమ క్యారెక్టర్ కు ఏది సెట్ అవుతుంది.. ఎలా చేస్తే ఆడియన్స్ మెప్పు పొందవచ్చు.. అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని.. పాత్రను డిజైన్ చేసుకుంటే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, ఆ పాత్ర ప్రేక్షకులలో ఒక సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేస్తుందని నెటిజన్స్ కూడా సలహాలు ఇస్తున్నారు. మరి ఇకనైనా ఏ హీరోకి ఏ యాస సెట్ అవుతుందో దృష్టిలో పెట్టుకొని అలా డైరెక్టర్లు ప్రయోగాలు చేస్తే బెటరేమో. మరి చూద్దాం ఇంకెంత మంది దర్శకులు ఇలాంటి హీరోలతో ప్రయోగాలు చేయించి వారిని విమర్శలకు గురయ్యేలా చేస్తారేమో..