Pawan kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఏం గా భాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో హీరోగా వరుసగా మూడు ప్రాజెక్టులకు సైన్ చేశారన్న విషయం తెలిసిందే.. ఆ మూవీలను ఎంత త్వరగా వీలైతే అంతగా ఈ మూవీ లను పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. డైరెక్టర్ క్రిష్, డైరెక్టర్ జ్యోతి కృష్ణ కలిసి ఈ సినిమాకు దర్శకత్వం ఇస్తున్నారు. ఈ మూవీ దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, థియేటర్లలో రిలీజ్ అయినందుకు సిద్ధంగా ఉంది. మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడటంతో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. మొత్తానికి ఇన్నిరోజులు థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఎట్టకేలకు జూన్ 12 న విడుదల కాబోతుంది.. ప్రస్తుతం డబ్బింగ్ పనులను పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు.
పవన్ కళ్యాణ్ రియల్లీ గ్రేట్..
హరిహర వీరమల్లు షూటింగ్ ఇటీవలే పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేయడం నిజంగా రికార్డు అనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు, ఏ సినిమాకి అయినా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోడట. వీరమల్లు మూవీకి నాలుగు గంటల సమయం మాత్రమే తీసుకున్నాడట.. అది కూడా సింగల్ టేక్ తోనే పూర్తి చెయ్యడం మామూలు విషయం కాదు. ఆ రికార్డు కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే చెల్లుతుంది. ఇకపోతే హరి హర వీరమల్లు చిత్రంలో ఆయన ఎలాంటి డైలాగ్స్ కొట్టాడో, ఆయన ఏ రేంజ్ యాక్షన్ చేసాడో చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. జూన్ 4 న ఫైనల్ ట్రైలర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ యోధుడుగా కనిపిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటివరకు అయితే పాజిటివ్ టాక్నే అందుకున్న ఈ సినిమాకు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి…
Also Read : కళ్లు చెదిరే ధరకు ఓటీటీ రైట్.. రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్..
ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొల్లగొట్టినాదిరో సాంగ్ కు రెస్పాన్స్ మాములుగా రాలేదు. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. రీల్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ ఏడాది లోనే ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.