BigTV English

OTT Movie: ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్ లో నరికి చంపే సైకో క్లోన్… వీక్ హార్ట్ ఉన్నవాళ్లు చూడకూడని బ్రూటల్ మూవీ

OTT Movie: ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్ లో నరికి చంపే సైకో క్లోన్… వీక్ హార్ట్ ఉన్నవాళ్లు చూడకూడని బ్రూటల్ మూవీ

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, హాలోవీన్ రోజు సైకో హత్యలు చేస్తుంటాడు. చైనా టౌన్‌ లో ఈ మారణహోమం జరుగుతుంది. ఆర్ట్ ది క్లౌన్ అనే సైకో ఈ హత్యలను రాత్రి సమయంలో మొదలెడతాడు. అతను  చేసే ఈ హత్యలను చూస్తే నిద్ర కూడా పట్టదు. అంత భయకరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

చైనా టౌన్‌ లో హాలోవీన్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటుంది. ఒక టీవీ షోలో మోనికా బ్రౌన్ అనే మహిళ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. గతంలో జరిగిన హాలోవీన్‌ లో ఒక భయంకరమైన ఊచకోత నుండి బయటపడిన, ఒక వికృతమైన మహిళను మోనికా ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ మహిళ ఆర్ట్ ది క్లౌన్ అనే సీరియల్ చేతిలో గతంలో దారుణంగా గాయపడి ఉంటుంది.  గత హాలోవీన్ లో కిల్లర్‌ను చనిపోయాడని, తాను కళ్ళారా చూశానని చెబుతుంది. కానీ అతని శవం మాత్రం మార్చురీ నుండి అదృశ్యమైందని మోనికాకి తెలుస్తుంది. ఇంటర్వ్యూ తర్వాత మోనికా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో ఆ మహిళ గురించి అవమానకరంగా మాట్లాడుతుంది. అయితే ఆ వికృతమైన మహిళ మోనికా పై దాడి చేసి కళ్లు పీకేస్తుంది. ఇప్పుడు స్టోరీ గతంలోకి వెళ్తుంది. గత హాలోవీన్ రాత్రి టారా హేయ్స్ ఆమె స్నేహితురాలు డాన్, ఒక హాలోవీన్ పార్టీ నుండి తాగిన స్థితిలో బయటకు వస్తారు. వీళ్ళు ఒక పిజ్జా హౌస్ కి వెళతారు. అక్కడ బాత్రూమ్‌లో ఆర్ట్ ది క్లౌన్ వీళ్ళను వెంటాడటం మొదలెడతాడు. ఆర్ట్ బాత్రూమ్‌లో విధ్వంసం సృష్టించడంతో రెస్టారెంట్ యజమాని అతన్ని బయటకు గెంటేస్తాడు. కానీ ఆ తరువాత డాన్ కారు టైర్లు పంక్చర్ అవుతాయి. టారా తన సోదరి విక్టోరియాను సహాయం కోసం పిలుస్తుంది.


అయితే ఆర్ట్ ఈలోగా డాన్‌ను తలక్రిందులుగా వేలాడదీసి, ఆమెను చాలా క్రూరంగా చంపుతాడు. టారా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, డాన్ ను చంపే దృశ్యాన్ని కళ్ళారా చూస్తుంది. ఇక టారాను చంపడానికి కూడా ఆర్ట్ వస్తాడు. అక్కడ టారాకు సహాయం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. కానీ ఆర్ట్ అతన్ని కూడా హత్య చేస్తాడు. విక్టోరియా అక్కడికి చేరుకుని తన సోదరి టారాను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆయితే ఆర్ట్ ఆమె మఖం పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి ఆర్ట్‌ను ఘాట్ చేస్తారు. అతడు చనిపోయాడనుకుని మార్చురీకి తీసుకెళ్తారు. అతని బాడిని పోస్టుమార్టం చయడం మొదలుపెట్టిన డాక్టర్ని గొంతు పిసికి చంపేస్తాడు ఆర్ట్‌. మరోవపు ఒక సంవత్సరం తర్వాత హాస్పిటల్ నుండి విక్టోరియా విడుదలవుతుంది. ఆమె ఎవరోకాదు ఇప్పుడు టీవీలో ఇంటర్వ్యూ చేసిన మోనిక కళ్ళు పీకేసిన మహిళ. చివరికి హాలోవీన్ రోజున ఆర్ట్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అతని చేతిలో ఎంత మంది టార్గెట్ అవుతారు ? విక్టోరియా చివరికి ఏమౌతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ముగ్గురితో ప్రేమ… అందం ఎరవేసి భర్తనే లేపించేసే భార్య.. ఈమె పెద్ద నెరజాణ గురూ!

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ అమెరికన్ స్లాషర్ సినిమా పేరు ‘టెర్రిఫైర్’ (Terrifier). 2016 లో వచ్చిన హర్రర్ ఫిల్మ్ కి డామియన్ లియోన్ దర్శకత్వం వహించారు. 2016లో టెల్లూరైడ్ హర్రర్ షో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ ప్రీమియర్ అయింది. ఆ తరువాత 2018 మార్చిన థియేటర్లలో విడుదల అయింది. ఇందులో జెన్నా కనెల్, సమంత స్కాఫిడి, డేవిడ్ హోవార్డ్ థోర్న్‌టన్, కాథరిన్ కొర్కొరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 85 నిమిషాల నిడివితో ప్రేక్షకులను భయపెట్టే ఈ మూవీ, హర్రర్ థ్రిల్లర్ జానర్‌ లో తెరకెక్కింది. ఈ సినిమాకి IMDb లో 5.5/10, Rotten Tomatoes లో 62% రేటింగ్‌ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Related News

HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : శవంపై కోరిక… ఏకంగా బాయ్ ఫ్రెండ్ ముందే దాంతో ఆ పని… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమా మావా

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×