BigTV English

Hari Hara VeeraMallu : హరి హర… మళ్లీ ఇదేం పంచాయితి.. మూవీ రిలీజ్‌కు అడ్డంకులు ?

Hari Hara VeeraMallu : హరి హర… మళ్లీ ఇదేం పంచాయితి.. మూవీ రిలీజ్‌కు అడ్డంకులు ?

Hari Hara VeeraMallu : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు మూవీ రిలీజ్‌కు మరో 10 రోజులు మాత్రమే ఉంది. జూన్ 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే, ఇప్పుడు ఈ హరి హర వీరమల్లు రిలీజ్ కొన్ని అడ్డంకులు ఏర్పడినట్టు తెలుస్తుంది. అవి క్లియర్ అవ్వకుంటే జూన్ 12న మూవీ రిలీజ్ అవ్వడం కష్టమే. దీంతో ఇప్పుడు నిర్మాత ఎఏం రత్నం తల పట్టుకుంటున్నట్టు సమాచారం.


2020లో ఈ మూవీ స్టార్ట్ అయింది. దాదాపుగా ఐదేళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ టైంలో డైరెక్టర్లు మారారు. సెట్స్ మారాయి. ఇంకా చాలా జరిగాయి. అన్నింటి ఫలితం… అనుకున్న దాని కంటే రెట్టింపు బడ్జెట్ అయింది. అది నిర్మాతకు తలకు మించిన భారంలా అయింది.

సినిమా స్టార్టింగ్‌లో 100 కోట్లతోనే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ, అది ఇప్పుడు 200 కోట్ల వరకు చేరిందని చెబుతున్నారు. ఆ నెంబర్ ఎక్కువే అయి ఉండొచ్చు అనేది ఇండస్ట్రీలో మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా… హరి హర వీరమల్లు వల్ల నిర్మాత చాలా కష్టాలు పడినట్టే.


ఫైనాన్స్ కష్టాలు..?

హరి హర వీరమల్లు బడ్జెట్ రెట్టింపు కావడంతో… అందరు నిర్మాతల్లా… రత్నం కూడా ఫైనాన్షియర్లను ఆశ్రయించాడట. వారి నుంచి సినిమా కోసం కొంత డబ్బు కూడా తీసుకున్నాడని ఇండస్ట్రీలో టాక్. నిర్మాతకు ఆ ఫైనాన్షియర్లకు జరిగిన ఒప్పందం ప్రకారం.. నిర్మాత రత్నం తీసుకున్న డబ్బును మూవీ రిలీజ్‌కు ముందే ఇవ్వాల్సి ఉంటుందట.

రిలీజ్‌కు ముందు జరిగే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ నుంచి వచ్చే డబ్బుతో ఫైనాన్షియర్లకు ఇవ్వాలని అనుకున్నారట. కానీ, ఇప్పుడు హరి హర వీరమల్లు రైట్స్‌ను కోనుగోలు చేయడానికి బయ్యర్లు పెద్దగా ముందుకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా… నిర్మాత అంచనా వేసిన దాని కంటే దాదాపు సగం ప్రైజ్‌కే డీల్ అంటున్నారట.

అలా చేస్తే సినిమాకు భారీగా నష్టాలు రావడం ఖాయం. దీంతో ట్రైలర్ రిలీజ్ తర్వాతే బిజినెస్ గురించి స్టెప్ తీసుకుందమని నిర్మాత అనుకుంటున్నాడు.

60 కోట్లు కడితేనే రిలీజ్..?

ట్రైలర్ రిలీజ్ తర్వాతే.. బిజినెస్ అనుకున్నారు. కానీ, ట్రైలర్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. ఇంకా ఫైనల్ ఎడిట్ అవ్వలేదు. ఫైనల్ ఎడిట్ అయిన తర్వాత ట్రైలర్ కట్ ఉంటుందట. ఇవన్నీ టైం టేకింగ ప్రసెస్. ఇదే టైంలో ఫైనాన్షియర్లు కూడా తీసుకున్న డబ్బును తిరిగి కట్టుమని తొందర పెడుతున్నారట. ఫైనాన్షియర్లకు దాదాపు 60 కోట్లు చెల్లిస్తేనే మూవీ రిలీజ్ చేయడానికి వీలు ఉంటుందని సమాచారం.

పవన్ ఆదుకుంటాడా..??

ఇప్పటికే ప్రొడ్యూసర్ రత్నం ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మళ్లీ 60 కోట్లు కట్టడం, అది కూడా బిజినెస్ అవ్వకముందే అంటే రత్నంకు మరింత కష్టమనే చెప్పాలి. అయితే ఈ టైంలో పవన్ ఆదుకుంటాడా మరి చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×