Pawan Kalyan Movie : పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయాలని చాలా మంది డైరెక్టర్లు అనుకుంటారు. కానీ, పవన్ కళ్యాణ్ తప్ప వేరే వాళ్లతో చేయను అని అనుకుంటాడేమో హరీష్ శంకర్. అలా అనుకునే… డైరెక్షన్‌కు 6 ఏళ్ల పాటు దూరమయ్యాడు. ఇప్పుడు ఆ వెయిటింగ్ మరోసారి కంటిన్యూ అవుతుందా..?
చాలా రోజుల సినిమాల వైపు తొంగి చూడకుండా.. కేవలం రాజకీయలపైనే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న సినిమాలను క్లియర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఐదేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న హరి హర వీరమల్లుకు పవన్ విముక్తి కల్పించాడు.
గత రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొని.. హరి హర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో మే 30న ఈ మూవీ రిలీజ్ అవ్వడం దాదాపు ఫిక్స్ అని తెలుస్తుంది. అక్కడ అమెజాన్ ప్రైమ్ కూడా మే 30నే ఫైనల్ డేట్ అని చెప్పేసింది. ఇక హరి హర వీరమల్లును పక్కన పెడితే… పవన్ తర్వాత ఫోకస్ ఓజీ అని తెలుస్తుంది.
ఈ నెల 14 నుంచి ఓజీ షూటింగ్ జరగే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఓజీ కోసం కూడా పవన్ కొన్ని డేట్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ డేట్స్ తో ఓజీకి కూడా ప్యాకప్ చెప్పేసి.. గుమ్మడికాయ కొట్టేస్తారట. ఇక పవన్ ఒప్పుకుని మిగిలిన మూవీ అంటే… అది ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే.
ఈ డబ్బింగ్ సినిమాను ఎప్పుడో పూర్తి చేయాల్సింది. దీని తర్వాత పవన్ సైన్ చేసిన బ్రో, ఎప్పుడో రిలీజ్ అయింది. అలాగే ఓజీ కూడా కంప్లీట్ కాబోతుంది. కానీ, ఉస్తాద్ ఊసే లేదు ఇప్పుడు.
గద్దలకొండ గణేష్ మూవీ రిలీజ్ తర్వాత పవన్ తో మూవీ అని హరీష్ శంకర్ అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి అంటే… దాదాపు 6 ఏళ్ల నుంచి పవన్ కోసం హరీష్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. 5 ఏళ్లు వెయిట్ చేసి.. పవన్ రావడం కష్టమే అని.. మధ్య లో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేశాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అయినా.. అవుద్దా… అంటే, ఇప్పుడు పవన్ కి ఉన్న పరిస్థితిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ను పూర్తి చేయడం కష్టమే అని చెప్పొచ్చు. ప్రస్తుతం హరి హర వీరమల్లును పూర్తి చేశాడు. ఓజీని పూర్తి చేసి, మళ్లీ రాజకీయాలపైనే ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. మళ్లీ కెమెరా ముందుకు రావడం అంటే ఎన్ని ఏళ్లు అవుతుందో..