Hari Hara Veeramallu OTT : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ మరోవైపు సినిమాలను దూరం పెట్టేశారు. సినిమాలు మీద ఆసక్తి పూర్తిస్థాయిలో తగ్గిపోయింది అనిపించేలా ఉన్నాయి ఆయన చేస్తున్న పనులు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్లో రీమేక్ సినిమాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ లో కూడా రీమేక్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశారు. ఈ తరుణంలో హరిహర వీరమల్లు అనే సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని 2020లో అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఒక స్ట్రైట్ ఫిల్మ్ తో చాలా ఏళ్లు తర్వాత వస్తున్నాడు అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.
ఫస్ట్ గ్లిమ్స్ పెంచిన అంచనాలు
ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ట్రీట్ లా అనిపించింది. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి సినిమా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని అందరూ ఊహించారు. అన్నింటిని మించి మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ రాగానే ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా తెలుస్తుంది అని అందరూ ఊహించరు.
ముఖ్యంగా ఆ సినిమాలోని పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్సెస్ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్ సీక్వెన్సెస్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే ఈ సినిమా కొద్దిపాటి ఆలస్యం అవుతుందని అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో ఈ సినిమాకి సమస్యలు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఓటీటీ డీల్ క్యాన్సిల్
హరి హర వీరమల్లు – అమెజాన్ ప్రైమ్ మధ్య ఉన్న ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిందని సమాచారం వినిపిస్తుంది. మే 30న రిలీజ్ కి హరి హర వీరమల్లు మేకర్స్ ఒప్పుకోకపోవడంతో… ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది.
హరి హర వీరమల్లు మూవీ మే 30 రిలీజ్ కావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ మే 30న రిలీజ్ కావడంలో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ కూడా ఒక కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ సీక్వెన్సెస్ అన్ని పూర్తయిపోయినట్లు తెలిసింది.