Harish Shankar: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరిష్ శంకర్ ( HarishSankar) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో ఈయన సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన పేరు గబ్బర్ సింగ్ డైరెక్టర్ గా మారిపోయింది. గ తేడాది రవితేజ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేస్తున్నాడు.. అయితే ఈ డైరెక్టర్ దారుణంగా మోస పోయాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఈ డైరెక్టర్ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ మూవీ లో రవితేజ హీరోగా నటించాడు. గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒకవేళ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యుంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఎదురు చూడకుండా, ఈపాటికి మరో సినిమా చేసుండేవాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ చూసిన తర్వాత హీరోలు ఇతనితో సినిమా చేయడానికే భయపడిపోతున్నారు. ఫలితంగా ఖాళీగా ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి.. అందుకే ప్రస్తుతం డైరెక్టర్ కు కమ్ బ్యాక్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి అవ్వాల్సిందే. లేదంటే మాత్రం ఆయనకు సినిమా అవకాశాలు దూరం అవుతాయి.. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఏం అయ్యాక సినిమాల పై అంతగా ఆసక్తి చూపించలేదు. దాంతో డైరెక్టర్ పరిస్థితి దారుణంగా మారింది.
Also Read :‘ఎంత పని చేశావ్ రా నా కొడకా’… కన్నీళ్లు తెప్పిస్తున్న సుహాస్ పోస్ట్
నిజానికి ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన చేసి దాదాపుగా 5 ఏళ్ళు అయ్యింది. షూటింగ్ ప్రారంభమై ఒక 30 శాతం వరకు పూర్తి చేసుకుంది కానీ, పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల మిగిలిన 70 శాతం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఏది ఏమైనా డైరెక్టర్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా పరిస్థితులు మారాయి. ఇక చేసేదేమి లేక యాక్టర్ గా మారాడు. సుహాస్ హీరో గా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రంలో హరీష్ శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాని హీరో రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఆయన పలు సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పాపం ఎలా ఉన్న డైరెక్టర్ ఎలా అయ్యాడు. అంతా పవన్ కళ్యాణ్ వల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఆ మూవీని త్వరగా పూర్తి చేసింటే ఇంత జరిగేది కాదు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి సినిమాను చేస్తాడేమో చూడాలి..