NewYork City: ప్రమోషన్ కోసం వస్తున్న ఓ షిప్.. డిస్టినేషన్‌కు దగ్గరగా రావడంతో వేగాన్ని పెంచింది. వంతెన కంటే షిప్ పెద్దదిగా ఉన్న విషయాన్ని అధికారులు మరిచిపోయారు. ఫలితంగా బ్రిడ్జిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూయార్క్ సిటీలో చోటు చేసుకుంది. అసలేం ఏం జరిగింది? లోతుల్లోకి ఒక్కసారి వెళ్తే..
న్యూయార్క్ సిటీలో ఫేమస బ్రూక్లిన్ బ్రిడ్జిని మెక్సికోకు చెందిన నేవీ నౌక క్వాటెమోక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 20 మందికి పైగానే గాయపడ్డారు. అయితే వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నమాట. బాధితులంతా షిప్‌లో సిబ్బంది ఉన్నారు.
అసలు కథేంటి?
నావల్ మిలిటరీ అకాడమీలో క్లాసులు తర్వాత కెడెట్ల శిక్షణ పూర్తి చేయడానికి ప్రతీ ఏడాది ట్రావెలింగ్ చేస్తారు. ఈ ప్రమోషన్‌లో భాగంగా 254 రోజుల ప్రయాణంలో 170 రోజులు సముద్రంలో గడపాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఆరున మెక్సికోలోని అకాపుల్కో పోర్టు నుంచి 277 మంది సిబ్బందితో క్వాటెమోక్ నేవీ షిప్ బయలుదేరింది.
15 దేశాల్లోని 22 ఓడరేవులను సందర్శించే ప్రణాళిక ఉంది. ఈ క్రమంలో న్యూయార్క్ సిటీకి చేరుకోనుంది. బ్రూక్లిన్ బ్రిడ్జి దాటగానే సిటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. ఈస్ట్ రివర్ మీదుగా వెళ్తున్న సమయంలో బ్రూక్లిన్ బ్రిడ్జి కింద నుంచి వెళ్తోంది నేవీ షిప్. షిప్‌కు ఉన్న మూడు పొడవైన స్తంభాలు.. వంతెన కింది భాగాన్ని బలంగా ఢీ కొట్టాయి.
ALSO READ: ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆసుపత్రి
ఆయా స్తంబాల చివరలు వంతెనకు తగిలి పాక్షికంగా కూలిపోయాయి. ఆ షిప్ ఆ సమయంలో లైటింగ్‌తో డెకరేట్ చేశారు. షిప్ స్తంభాలు కూలుతున్న సమయంలో కొందరు వ్యక్తులు వాటిని పట్టుకుని వేలాడుతూ కనిపించారు. ఘటన సమయంలో బ్రూక్లిన్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఘటన జరిగిన వెంటనే రెస్యూ టీమ్‌లు అలర్ట్ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్. షిప్ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారని తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
క్వాటెమోక్ నౌక సుమారు 297 అడుగుల పొడవు ఉంది. 40 అడుగుల వెడల్పు ఉందని మెక్సికో నేవీ విభాగం తెలిపింది. బ్రిడ్జితో జరిగిన ప్రమాదం వల్ల షిప్ బాగానే దెబ్బ తింది. ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్నారు. ఈ టూర్‌కి దాన్నే కంటిన్యూ చేస్తారా? మరో షిప్‌కి మార్చుతారా అనేది తెలియాల్సివుంది.
live from #newyork a ship without a captain 👀 #brooklynbridge . Fortunately I don't think anyone was injured pic.twitter.com/3fQPNrQNy0
— Trystan (@TrystanNFT) May 18, 2025