Pawan Kalyan: తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అయిన మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్‌లో ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అసలు మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది, ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి ముందుకొచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించకపోయినా.. ప్రేక్షకుల ఆందోళన చూసి స్పెషల్‌గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి అప్డేట్ అందించడంతో పాటు చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఈ విషయంపై కనుక్కోవడానికి ఫోన్లు చేస్తున్నారని ప్రతీ ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.
అగ్ని ప్రమాదం తీవ్రత
తాను అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చిందని తెలిపారు పవన్ కళ్యాణ్. తన కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) చదువుతున్న స్కూల్‌లోనే అగ్ని ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రమాదం తీవ్రత అంతలా ఉంటుందని తాను ఊహించలేదని వ్యాఖ్యలు చేశారు. దాని వల్లే మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని అన్నారు. దాని వల్లే తన ఊపిరి తిత్తుల్లోకి గాలి వెళ్లిందట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రధాని మోదీ సైతం ఫోన్ చేసి ఆరా తీశారని తెలిపారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సైతం స్పందించారని అన్నారు.
చికిత్స జరుగుతోంది
ముందుగా ఈ అగ్ని ప్రమాదంపై సింగపూర్ హై కమీషనర్ తనకు సమాచారం అందించారని తెలిపారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అయిన అకీరా నందన్ పుట్టినరోజు. ఇక అకీరా నందన్ పుట్టినరోజు సందర్భంగానే మార్క్ శంకర్‌కు ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం అని వాపోయారు పవన్. చేతులు, కాళ్లకు అయిన గాయాల కంటే పొగ పీల్చడం వల్లే మార్క్ శంకర్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దానికే వైద్యులు చికిత్స అందిస్తున్నారని అప్డేట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు పెద్దగా ప్రమాదం లేదని అభిమానులకు అర్థమయ్యింది. దీంతో కాస్త కుదుటపడ్డారు.
Also Read: 150 మంది నా ఇంట్లోకి చొరబడ్డారు.. మరోసారి పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్
అక్కడే సెటిల్
అసలు సింగపూర్‌లోని అన్ని వసతులు ఉన్న స్కూల్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.? అందులో పవన్ కుమారుడు ఎలా చిక్కుకున్నాడు.? అనే సందేహాలు చాలామంది అభిమానుల్లో ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్‌లో తన పిల్లలతోనే కలిసి ఉంటోంది. ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఆమె ఇండియాకు వస్తూ పవన్‌కు తోడుగా ఉంటోంది. అందుకే తమ కుమారుడు మార్క్ శంకర్‌ను కూడా అక్కడే స్కూల్‌లో జాయిన్ చేశారు. ఉదయం 9.45 నిమిషాలకు ఆ స్కూల్‌లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌తో పాటు పలువురు ఇతర విద్యార్థులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది.