Trivikram Srinivas: టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్వయంవరం సినిమాతో రైటర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకు రైటర్ గా పని చేశారు. ఆ తర్వాత దర్శకుడిగా సినిమాలు తీశారు. ఖలేజా, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అలా వైకుంటపురం, గుంటూరు కారం లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పారు. ఈయన తీసే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుందన్నది నిజం. అయితే మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన గురూజీ ఆయన సినిమాలను కాపీ కొట్టి తీస్తారు అని టాక్.. అలాంటిది తాజాగా ఆయన తన మనసులో మాట ఒకటి బయట పెట్టారు. ఆయన అనుకున్న సినిమాని వేరే వాళ్ళు కాపీ కొట్టడంతో ఆయన బాధపడినట్లుగా చెబుతున్నారు. అసలు ఆ సినిమా ఏంటి ఆయన దేనికి బాధపడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం..
అందుకే బాధపడ్డాను ..
గురూజీ సినిమాలు అంటేనే చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే విధంగా ఉంటాయి. ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ లో తను చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ 2007 లో ది డార్క్ నైట్ సినిమాకు సంబంధించిన ఆలోచన నాకు సినిమా రిలీజ్ కి ముందే ఉంది. ఇలాంటి సినిమా తీయాలని నేను ఒక స్టోరీ లైన్ అనుకున్నాను. ఈలోపే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూసిన తర్వాత నేను ఒక వారం రోజులు బయటికి రాలేదు. నాకు వచ్చిన ఆలోచననే వారికి వచ్చి, నాకన్నా ముందు సినిమా తీసేసారు అని చాలా బాధపడ్డానని త్రివిక్రమ్ తెలిపారు. హాలీవుడ్ మూవీ డార్క్ నైట్ సినిమా గురించి ఆయన తన మనసులో మాటని బయటపెట్టారు. ఇది చూసిన వారంతా గురూజీనే సినిమాలు కాపీ కొడతారు అని అనుకున్నాం కానీ, ఆయన సినిమాని హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారా అని కామెంట్స్ చేస్తున్నారు.
రాబోయే సినిమాలో హీరో..
ఇక సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా తీయనున్నారు. ఈ సినిమా సోషల్ ఫాంటసీ మూవీగా రానుంది. అయితే ప్రస్తుతం బన్నీ అట్లీతో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే త్రివిక్రమ్ రామ్, విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తాడని పుకార్లు ఉన్నాయి. అట్లీ బన్నీ మూవీ కంప్లీట్ అయ్యేంతవరకు వేచి వుండాలా లేదంటే వేరే హీరోతో సినిమా చేయాలా అనే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రమ్. 2024 లో గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా కావడం విశేషం. అతడు, ఖలేజా తర్వాత వచ్చిన గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టించిందని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కావడంతో ఆయన ఎవరితో సినిమా చేస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Hrithik Roshan : అంతా ఎన్టీఆర్ వల్లే… వార్ 2 మూవీలో ఇదే హైలెట్