Harihara Veeramallu:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్లీ ముఖానికి రంగు పులుముకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.. “ధర్మం దే విజయం” అంటూ జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు మాత్రమే విడుదల అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. అటు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కాబోతున్న సినిమా కావడంతో డిమాండ్ కూడా భారీగానే ఏర్పడింది.
హరిహర వీరమల్లు సినిమాకి నైజాంలో భారీ డిమాండ్..
దీనికి తోడు ఈ సినిమా బిజినెస్ లెక్కలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా నైజాం ఏరియాలో ఈ సినిమాకు జరిగిన బిజినెస్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . సాధారణంగా నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ మూవీలకి డిమాండ్ భారీగానే ఉంటుంది. అటు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత రాబోతున్న మొదటి సినిమా కావడంతో ఆ అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. అందులో భాగంగానే నైజాం ఏరియాలో ఈ సినిమాను ఏకంగా రూ.50 కోట్లకు డిమాండ్ చేస్తున్నారట. అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ లో నైజాం ఏరియా చాలా పెద్దది. ఇక్కడ నుంచే దాదాపు 50 శాతం రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సిటీ సినిమాలకు మంచి బిజినెస్ ఏరియా కూడా ఇదే.పైగా పవన్ కళ్యాణ్ సినిమాలు హైదరాబాదులో బాగానే వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. ఇక అందుకే ఇప్పుడు ఆ రేంజ్ లో డిమాండ్ పలుకుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హరిహర వీరమల్లు కి నైజాంలో ఏర్పడిన డిమాండ్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ లెక్కలు ఏపీ బిజినెస్ లో అంతకుమించి ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా జూన్ 12న రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి కలెక్షన్స్ వసూల్ చేస్తుందో చూడాలి.
హరిహర వీరమల్లు సినిమా..
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మొదట క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి బాధ్యతలు తీసుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుండి తప్పుకోవడంతో ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna)రంగంలోకి దిగారు. ఇప్పుడు భారీ అంచనాల మధ్య ఈ సినిమాను రూపొందించడం జరిగింది. అయితే ఈ హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతోందని, ప్రస్తుతం వరకు పూర్తయిన కథను మొదటి భాగంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇందులో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరియర్ కు మరింత ప్లస్ గా నిలవనుంది అని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓజీ, అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ALSO READ:Aishwarya Rajesh: కామాఖ్య దేవాలయంలో భాగ్యం ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్..!