Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి. నిన్న మొన్నటి వరకు పరుగులు పెట్టిన గోల్డ్ రేట్స్ ఈరోజు(మే 26th) కాస్త దిగొచ్చాయి. తాజాగా పసిడి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.400 తగ్గింది. దీంతో రూ.89,500 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.97,640 వద్ద కొనసాగుతోంది.
ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో.. పసిడి ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య చర్చలు పునఃప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో పెట్టుబడిదారులు రిస్కీ అసెట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. భద్రతా పెట్టుబడిగా భావించే పసిడిపై డిమాండ్ తగ్గి, పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి.
ఇప్పటికే.. బంగారం ధరల్లో తగ్గుదల మొదలైంది. గోల్డ్ కొనే ఆలోచన ఉంటే.. ఇంకొన్నాళ్లు ఆగడం బెటరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని వారాల్లో.. గోల్డ్ రేట్లు 90 వేలకు కంటే దిగువకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయి ధరల నుంచి 5 నుంచి 7 శాతం బంగారం రేట్లు తగ్గాయి. అందువల్ల.. మరో 2, 3 వారాలు ఆగితే.. ధరలు మరింత దిగొస్తాయని అంటున్నారు.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,550 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,640 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,550 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,640 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,550 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,640 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,650 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,790 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,550 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,640 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,550 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,640 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: కస్టమర్లపై జొమాటో మరింత బాదుడు.. మండిపడుతున్న రెస్టారెంట్ల యజమానులు
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,11,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00, 000 వద్ద కొనసాగుతోంది.