Payal Rajput: చాలావరకు సినీ సెలబ్రిటీల లైఫ్ బయటికి కలర్‌ఫుల్‌గా కనిపించినా వారి జీవితాల్లో కూడా ఎన్నో కష్టాల్లో ఉంటాయని అంటుంటారు. కానీ కొందరు సెలబ్రిటీలు వారి పర్సనల్ లైఫ్‌లోని కష్టాలను అందరితో షేర్ చేసుకుంటే కొందరు మాత్రం వాటిని ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతారు. తాజాగా యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాత్రం తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కుంటున్న అతిపెద్ద కష్టం గురించి తాజాగా బయటపెట్టింది. తన తండ్రికి క్యాన్సర్ అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసింది పాయల్. పాపం పాయల్ కష్టం చూసి చాలామంది నెటిజన్లు తన తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అవకాశాలు తగ్గాయి
‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). అసలు తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదంటూ దానిని యూత్ అంతా కలిసి బ్లాక్‌బస్టర్ చేశారు. అలా పాయల్‌కు కూడా తెలుగులో గ్రాండ్ డెబ్యూ దొరికింది. కానీ ఆ మూవీలో బోల్డ్ పాత్రలో కనిపించడంతో తనకు వరుసగా అలాంటి అవకాశాలే రావడం మొదలయ్యింది. మెల్లగా ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే పాయల్.. తాజాగా తన పర్సనల్ లైఫ్‌లోని విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది.
చాలా భయమేస్తోంది
‘ఇటీవల మా నాన్నకు ఎసోఫెగల్ క్యార్సినోమా అంటే క్యాన్సర్ ఉందనే విషయం బయటపడింది. అందుకే మేము కిమ్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ మొదలుపెట్టాలని అనుకున్నాం. ఈరోజే ఆయన మొదటి కీమోథెరపీ సెషన్. ఇందులో ఆయన సుదీర్ఘ ప్రయాణం గురించి తలచుకుంటుంటేనే నాకు చాలా భయమేస్తోంది. కానీ ఇది అవసరమని మా అందరికీ తెలుసు. మా నాన్న చాలా స్ట్రాంగ్. ఆయన కచ్చితంగా దీని నుండి బయటపడతారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా మా నాన్న నన్ను పని ఆపకు అని, షూటింగ్స్‌కు వెళ్లమని ప్రోత్సహిస్తున్నారు’ అంటూ తన తండ్రికి క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలవుతున్న విషయాన్ని షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్.
Also Read: నాలో ఇంకో యాంగిల్ చూస్తారు.. అది నా బ్లడ్‌లో ఉంది
అదే ముఖ్యం
‘నేను ఇలాంటి ఒక కష్టమైన జర్నీని మొదలుపెడుతున్నానని కాబట్టి దీని గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. మీ ప్రేమ, సపోర్ట్, పాజిటివిటీ అనేది ఇప్పుడు మాకు చాలా ముఖ్యం. మా నాన్న కోలుకోవాలని కోరుకుందాం. క్యాన్సర్‌ను పోరాడే ఈ క్రమంలో మీ ప్రతీ ఒక్కరి ఆశీర్వాదం మాకు ముఖ్యమే’ అంటూ వాపోయింది పాయల్ రాజ్‌పుత్. దీంతో తన ఫ్యాన్స్ అంతా తన తండ్రి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా ఈ క్రమంలో తన తండ్రికి బాగా ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లకు కూడా స్పెషల్‌గా థాంక్యూ చెప్పుకుంది. వారి ప్రేమ, ఆదరణ వల్లే ఆయన ఆరోగ్యం మెరుగు అవుతుందని ఆశపడుతోంది పాయల్.
THIS TOO ,SHALL PASS 🙏🏼🌸 pic.twitter.com/v9UD26HFTe
— paayal rajput (@starlingpayal) April 8, 2025