BigTV English

Tamannaah Bhatia: నాలో ఇంకో యాంగిల్ చూస్తారు.. అది నా బ్లడ్ లో ఉంది.

Tamannaah Bhatia: నాలో ఇంకో యాంగిల్ చూస్తారు.. అది నా బ్లడ్ లో ఉంది.

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. సంపత్ నందితో కలిసి డి.మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా కి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. తమన్నా శివశక్తి పాత్రలో మెప్పించనున్నారు. ఈ సినిమాలో వశిష్ట, ఎన్ సింహ, యువ, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా తమన్న రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


తెలుగు మాట్లాడటం నా బ్లడ్ లో వుంది ..

మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అన్ని బాషల లో సినిమాలు తీస్తున్నప్పుడు, ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇంత చక్కగా గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అలా ఎలా సాధ్యమైంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తమన్నా మాట్లాడుతూ..’ ఒకసారి నేర్చుకున్న తర్వాత లాంగ్వేజ్ ఎప్పటికీ పోదు కదా.. అందుకే ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేను తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాను. అందరు ఇదే ప్రశ్న అని తరచూ అడుగుతారు. ఏమో తెలుగు మాట్లాడడం నా బ్లడ్ లోనే ఉంది అనిపిస్తుంది’ అని సమాధానం ఇచ్చారు.


ఓటీటీ అయినా నాకు ఓకే

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మీరు ఎక్కువగా, కమర్షియల్ సినిమాలే చేశారు కదా.. అందులో ను మీరు ఎక్కువ పాటలు, డాన్స్ మీద ఫోకస్ పెట్టేవారు. అలాంటిది కొంత కాలం నుండి మీరు చేస్తున్న సినిమాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దానికి కారణం ఏదైనా ఉందా ,అని యాంకర్ అడగ్గా.. తమన్నా మాట్లాడుతూ.. ‘ నేను అవకాశం వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని కథ నచ్చితే చేస్తాను. ఏ అవకాశం వచ్చినా అది చిన్న స్క్రీన్ ఆ పెద్ద స్క్రీనా అన్నది చూడను. ఓటీటీ లో వచ్చిన అది నాకు సంతోషమే. ఎందుకంటే నాకు కథ ఇంపార్టెంట్. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్, అయితే నేను కచ్చితంగా చేస్తాను. అభిమానులు ఆదరిస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. ఎక్కడ చేశామా అన్నది ముఖ్యం కాదు అని నా అభిప్రాయం’ అని తెలిపారు.

క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది ..

‘ఆజ్ కి రాత్’ నీ మేము ఎంజాయ్ చేస్తున్న టైం ఓదెలా 2 నుంచి పోస్టర్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. చూడ్డానికి చాలా కొత్తగా అనిపించింది. దీని గురించి మీరు ఏమంటారు? అని అడగ్గా.. తమన్నా స్పందిస్తూ ‘ ఓదెల 2 టూ పోస్టర్ రిలీజ్ చేసే క్రెడిట్ అంతా సంపత్ నందిగారికే ఇవ్వాలి. అసలు నన్ను ఈ శివశక్తి క్యారెక్టర్ లో, ఆయన సెలెక్ట్ చేయడమే నా అదృష్టంగా భావిస్తాను. అంతకుముందు ఆయనతో కలిసి నేను కొన్ని సినిమాలు చేశాను. ‘రచ్చ, బెంగాల్ టైగర్’ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేసిన తరువాత ఆయన నుంచి ఇలాంటి ప్రాజెక్టు వస్తుందని.. అది నా వరకు వచ్చి నన్నే అడుగుతారని నేను ఊహించలేదు. ఆ కథ వినగానే నాకు చెయ్యాలనిపించింది. అందుకే ఓకే చెప్పేశాను. మొదటి నుంచి ఆయన తన సినిమాలో ఉమెన్ కి సంబంధించిన క్యారెక్టర్ ని చాలా డీసెంట్ గా డిజైన్ చేస్తారు. అదే నాకు నచ్చుతుంది. అందుకే ఈ సినిమాకి ఓకే చెప్పాను.

కాశీ అందుకే వెళ్ళాను ..

ఈ క్యారెక్టర్ గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు నాకు చాలా సర్ప్రైజ్ గా అనిపించింది. భక్తి అన్నది నేను నమ్ముతాను. అనుకోకుండా కాశీలో ఈ సినిమాని రివిల్ చేయడం, మహాకుంభమేళాలో పోస్టర్ రిలీజ్ చేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ప్రత్యేకంగా నేను మధు గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన ప్రమోషన్స్ ను ఎంత బాగా చేస్తున్నారన్నది నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే కుంభమేళా జరిగే టైంలో, అక్కడికి టీమ్ మొత్తాన్ని తీసుకువెళ్లి, పోస్టర్ రిలీజ్ చేయడం అంటే చాలా కష్టం. కాశీ కూడా నేను ఈ సినిమా కోసమే ఫస్ట్ టైం వెళ్లాను. అక్కడ ఏదో శక్తి ఉంది అనిపిస్తుంది’ అని తమన్నా తెలిపారు .

తెలుగులో కొంత గ్యాప్ తరువాత సంపత్ నందితో, కలిసి తమన్నా చేస్తున్న సినిమా కావడం విశేషం.ఈ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్ట్ చాలా సక్సెస్ అయ్యింది. అలాగే ఈ సీక్వెల్  రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×