Ipl2025 : ప్రస్తుత కాలంలో ఎంటర్టైన్మెంట్ కు డోకా లేకుండా పోయింది. ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ తో పాటు ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే స్పోర్ట్స్ పై కూడా సినిమా ప్రభావం విపరీతంగా ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టీం గెలిచింది అంటే ఆ టీం కి భారీ ఎలివేషన్ ఇవ్వడం అలవాటైపోయింది. చాలామంది హీరోలకు కొన్ని సినిమాల్లోని పాటలు తీసి అప్లై చేస్తూ ఉంటారు. సన్రైజర్స్ హైదరాబాద్ టీం లో ప్లేయర్స్ లో కొందరిని కాటేరామ్మ కొడుకులని పిలుస్తూ ఉంటారు. సినిమా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2026 మార్చి 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్
ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అలానే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. రెహమాన్ నుంచి ఆ స్థాయి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎవరు ఊహించి ఉండరు. ఇక రాంచరణ్ తేజ్ యాస కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్లకి ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అవుతుంది అని చెప్పాలి. బుచ్చిబాబు ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది ఇది ఒక మంచి స్టోరీ అని పలు సందర్భాల్లో దర్శకుడు బుచ్చిబాబు చెబుతూ వచ్చాడు.
ముంబై ఇండియన్స్ ఎలివేషన్స్
నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ టీం మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసింది. అయితే మొదట వికెట్లు చక చక పడిపోతున్న కూడా. కొండాపూర్ క్లాసిన్ వచ్చి తన బ్యాట్ తో చుక్కలు చూపించాడు. ఒక మంచి స్కోర్ ను సన్ రైజర్స్ టీంకు అందించాడు. అయితే వాటిని చాలా ఈజీగా చేజ్ చేసింది ముంబై ఇండియన్స్ టీం. ఈ టీం గెలిచిన వెంటనే తన అఫీషియల్ పేజ్ లో పెద్ది సినిమా నుంచి ఒక ఫోటో ని అప్లోడ్ చేశారు. ఆ ఫోటోని కోట్ చేస్తూ పెద్ద పెద్ద విన్ రాసుకోచ్చారు. ఇక ఈ పిక్చర్ చూస్తుంటే చాలామందికి ఐపీఎల్లో కూడా పెద్ది హవా బాగానే నడుస్తుంది అని అభిప్రాయం ఏర్పడింది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Pedda pedda pedda win in Hyderabad 😎#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #SRHvMI pic.twitter.com/VapWywQ0uN
— Mumbai Indians (@mipaltan) April 23, 2025