BigTV English

Peddi Movie : ‘పెద్ది’ షాట్.. క్రెడిట్ మొత్తం అతనికే.. డైరెక్టర్..

Peddi Movie : ‘పెద్ది’ షాట్.. క్రెడిట్ మొత్తం అతనికే.. డైరెక్టర్..

Peddi Movie : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ .. ఈ ఏడాది భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించిన రామ్ చరణ్ సరికొత్త కథ పెద్ది తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ గ్లింప్స్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.. ప్రస్తుతం ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


క్రెడిట్ మొత్తం అతనికే..

పెద్ది గ్లింప్స్ వీడియోలో రామ్‌చరణ్‌ క్రికెట్‌ ఆడే సీన్‌కు నెట్టింట విశేష స్పందన దక్కింది. ఆ షాట్‌ క్రీడా అభిమానుల్ని ఆకర్షించింది. దీంతో, అది పెద్ది షాట్‌గా ట్రెండ్‌ అయింది. ఆ విభిన్న ఆలోచన ఎవరిదో దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫైట్‌ మాస్టర్‌ నవకాంత్‌ ఆ షాట్‌ను డిజైన్‌ చేశారని, అతడికే క్రెడిట్‌ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. ఆ క్రికెట్ షాట్ మూవీకి హైలెట్ అవుతుందని డైరెక్టర్ అంటున్నారు. దాంతో దీనిపై అంచనాలు పెరుగుతున్నాయని డైరెక్టర్ అంటున్నారు. అంతేకాదు ఈ గ్లిమ్స్ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ షార్ట్ పై ప్రశంసల కురిపించాడని బుచ్చి బాబు అంటున్నాడు.


Also Read :సింగర్ ప్రవస్తి విషయం పై సునీత భర్త సీరియస్.. సునీత క్షమాపణలు..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

పెద్ది మూవీలో రామ్ చరణ్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలను చూస్తే అర్థమవుతుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్‌ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు బుచ్చిబాబు తెలిపారు. నేనెప్పుడూ రూటెడ్‌ స్టోరీలనే చెప్పాలనుకుంటుంటా. ఆయా కథల్లోని ఎమోషన్‌, సంఘటనలకు ఎక్కువ మంది కనెక్ట్‌ అవుతారని భావిస్తాను.. నేను తెరకేక్కించిన మొదటి సినిమా ఉప్పెన కరోనా టైం లో విడుదల అవుతుందా? అయితే సక్సెస్ అవుతుందా? అని అనుకున్న.. అందరి సినిమాలో ఎదో తూ తూ మంత్రంలాగా ఓటీటీలో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. ఈ సినిమా పోయినా పర్లేదు మరో సినిమాపై ఫోకస్ పెట్టాలని అప్పుడే పెద్ది స్టోరీని రాసుకున్నాను. ఈ స్టోరీ లైన్ ని సుకుమార్ గారికి వినిపిస్తే ఆయన చాలా బాగుంది అదిరిపోయింది అని మెచ్చుకున్నారని బుచ్చిబాబు అంటున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ సినిమా వచ్చేయడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×