Eating Food in Plates: వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారు చేసిన ప్లేట్లలో పూర్వం ఆహారం తినేవారు. చాలా మంది ఇత్తడి పాత్రల్లో కూడా వంటకాలు తయారు చేసేవారు. మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకరమైన అలవాట్లలో ఇది కూడా ఒకటి. వీటిలో ఆహారం తినడం వల్ల కూడా శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెండి (Silver) ప్లేట్లలో తినడం వల్ల లాభాలు :
వెండి లో యాంటీబాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. వెండి ప్లేట్‌లో తిన్న ఆహారం స్వఛ్చంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెండి ప్లేట్‌లో తినడం ఆ ఆహారం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఇత్తడి (Brass)ప్లేట్లలో తినడం వల్ల లాభాలు:
ఇత్తడి (Brass) అనేది రాగి (Copper), జింక్ (Zinc)ల మిశ్రమం. ఇందులో తినే ఆహారం శక్తివంతమైన అణువులను శరీరంలోకి చేరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే ఇత్తడి పాత్రలు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడానికి ఉపయోగించకూడదు. ఇత్తడిలో తినే ఆహారం మానసిక శక్తిని పెంచుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
కంచు (Bronze) ప్లేట్లలో తినడం వల్ల లాభాలు:
కంచు అనేది రాగి, టిన్ (Tin) మిశ్రమం. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కంచు పాత్రల్లో తినే ఆహారం శక్తివంతంగా ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కంచు ప్లేట్‌లో తినడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. పురుషుల హార్మోన్ల సంతులనాన్ని కాపాడడంలో ఇది సహాయపడుతుంది. కంచు ప్లేట్‌లో తినే ఆహారం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.
Also Read: సమ్మర్‌లో చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే.. ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి !
సాధారణ లాభాలు:
ఈ మూడు మెటల్స్ కూడా శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను తగ్గిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ప్లాస్టిక్ , స్టీల్ పాత్రలతో పోలిస్తే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. సహజమైన, ఆయుర్వేద గుణాలను కలిగి ఉన్నాయి. పూర్వ కాలంలో రాజులు, మహారాజులు ఈ ప్లేట్లలోనే తినేవారు. ఎందుకంటే వాటిలో ఉన్న ప్రాకృతిక శక్తులు శరీరానికి శుభ్రత, శక్తిని అందిస్తాయి.
మన సంప్రదాయంలో ఉన్న ఈ విలువైన అలవాట్లను మనం మళ్లీ పాటిస్తే.. అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. వాడకానికి ముందు , తరువాత ఈ ప్లేట్లను శుభ్రంగా ఉంచడమే కాకుండా.. సరైన విధంగా వాటిని వాడితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.